
Saturn transit 2026
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ నక్షత్రాలను, రాశులను మార్చుకుంటూ సంచారం చేస్తుంటాయి. ఈ సంచారం ఆయా రాశులు, నక్షత్రాలపై మంచి, చెడు ప్రభావాలు చూపుతాయి. మానవ జీవితం, వృత్తి, ఆరోగ్యం, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. తాజాగా, కర్మ దేవుడైన శని సంచారం ప్రత్యేకంగా సాగుతోంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాది నక్షత్రానికి సంచారం చేశాడు. నాలుగు నెలలపాటు ఈ ప్రత్యేకమైన సంచారం కొనసాగనుంది. జనవరి 20 నుంచి మే 17 వరకు శని ఉత్తరాది నక్షత్రంలో సంచరించడం వల్ల 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- మేషరాశి
ఈ రాశి వారికి శని సంచారం కష్టకాలం అవుతుంది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. ఓపిక చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఏప్రిల్ తర్వాత కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం, కుటుంబ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.
- వృషభ రాశి
శనిసంచారం వల్ల వృషభ రాశివారికి చాలా లాభపడతారు. ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, వ్యాపార లాభాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక కెరీర్ ఆందోళనలు తొలగిపోతాయి. భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటారు.
- మిథునరాశి
శని సంచారంతో మిథున రాశివారికి గౌరవం, హోదా పెరుగుతాయి. కొత్త బాధ్యతలు గుర్తింపును పెంచుతాయి. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి.
- కర్కాటక రాశి
ఈ రాశివారికి శని సంచారంతో భావోద్వేగ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ మార్పు లేదా స్థాన చలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై ముఖ్యంగా నిద్ర, జీర్ణక్రియపై శ్రద్ధ చూపడం ముఖ్యం.
- సింహరాశి
శని సంచారంతో సింహరాశి వారు కష్టపడితే విజయం సాధిస్తారు. అందుకే వీరు కష్టపడి పనిచేయడం అవసరం. ఉన్నతాధికారులతో సంబంధాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు తమ ఖ్యాతిని పెంచుకుంటారు.
- కన్యారాశి
శని సంచారం కన్యారాశి వారికి శాంతి, స్థిరత్వాన్ని తెస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి. పదోన్నతి లేదా బాధ్యతాయుతమైన పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. మనశ్శాంతి పెరుగుతుంది.
- తులారాశి
తులా రాశి వారికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ, శని గ్రహం మంచి ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. భాగస్వామ్యం, చట్టపరమైన విషయాలలో జాగ్రత్త అవసరం.
- వృశ్చికరాశి
వృశ్చికరాశి వారికి ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. శని సంచారం కారణంగా ఖర్చులు పెరగవచ్చు. పనిలో మార్పులు సంభవిస్తాయి. ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలు మానసిక బలాన్ని పెంచుతాయి.
- ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి వని సంచారం నిర్ణయాత్మకంగా ఉంటుంది. జీవితంలో తొలగిపోతుంది. కెరీర్ కొత్త దిశలో వెళుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ సమయంలో ప్రారంభించిన పని దీర్ఘకాలిక ప్రయోజనాలు తెస్తుంది.
- మకర రాశి
శని సంచారంతో మకర రాశి వారికి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గత సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. కెరీర్ వృద్ధి, ఆర్థిక లాభాలు, సామాజిక ప్రతిష్ఠ పెరుగుతాయి.
- కుంభ రాశి
శని సంచారంతో కుంభరాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఇందులో కొంత ఆలస్యం జరగవచ్చు. కెరీర్ మార్పు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం, ముఖ్యంగా మీ ఎముకలు, కీళ్ల పట్ల శ్రద్ధ వహించండి.
- మీనరాశి
శని సంచారంతో మీన రాశి వారిలో ఆత్మ విశ్వాసం పెంచుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి ఉంటుంది. కెరీర్ స్థిరత్వం క్రమంగా పెరుగుతుంది. సృజనాత్మక, ఆధ్యాత్మిక రంగాలలో పాల్గొన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)