Saturday Remedies: ఏలి నాటి శని దోష ప్రభావం తగ్గించేందుకు శనివారం ఇలాంటి పరిహారాలు చేసి చూడండి..

ఏలి నాటి శని ప్రభావం మూడు దశలుగా ఉంటుంది. మొదటి దశలో ఒక వ్యక్తి భూమి, భవనం, ఆస్తి మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏలి నాటి శని ప్రభావంతో రెండవ దశ మరింత బాధాకరమైనదిగా పరిగణించబడుతుంది. రెండవ దశలో వ్యక్తికి డబ్బు కొరత ఉంటుంది.. అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకుపోతారు. ఏలి నాటి శని ప్రభావం మూడవ దశ మొదటి రెండు దశల కంటే తక్కువ ప్రభావం చూపిస్తుంది.

Saturday Remedies: ఏలి నాటి శని దోష ప్రభావం తగ్గించేందుకు శనివారం ఇలాంటి పరిహారాలు చేసి చూడండి..
Saturday Remedies

Updated on: Aug 26, 2023 | 7:15 AM

తొమ్మిది గ్రహాలలో ఒకటైన శనిదేవుడు జాతకంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరి జాతకంలోనైనా శని  దోషం ఉంటె.. ఆ వ్యక్తి  అనేక రకాల సమస్యలకు గురవుతాడు. శని దృష్టితో అనేక కష్టనష్టాలకు గురవుతాడు. హిందూ మతంలో శనీశ్వరుడు కర్మ ప్రదాతగా భావిస్తారు. మంచి చెడుల కర్మలకు శిక్షనిచ్చె దేవుడుగా పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి రాజు, పేద అనే తేడా లేదని ఒకటే. ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా వస్తుంది. ఈ నేపథ్యంలో సాడే శని ఇబ్బందులను తొలగించడానికి సులభమైన మార్గాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో శనిశ్వరుడికి సంబంధించిన ఏదైనా దోషం ఏర్పడినప్పుడు లేదా ఏలి నాటి శని ప్రభావం పడినా వ్యక్తి ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.  ఎవరి  జాతకంలోనైనా ఏలినాటి శని దోషం రెండున్నర సంవత్సరాలు ఉంటే ..  లి నాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది.

ఏలి నాటి శని ప్రభావం మూడు దశలుగా ఉంటుంది. మొదటి దశలో ఒక వ్యక్తి భూమి, భవనం, ఆస్తి మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏలి నాటి శని ప్రభావంతో రెండవ దశ మరింత బాధాకరమైనదిగా పరిగణించబడుతుంది. రెండవ దశలో వ్యక్తికి డబ్బు కొరత ఉంటుంది.. అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకుపోతారు. ఏలి నాటి శని ప్రభావం మూడవ దశ మొదటి రెండు దశల కంటే తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎవరైనా శని దోషం లేదా లి నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతుంటే.. ఈ పరిహారాలు ఒక వరం వంటివి.. అవి ఏమిటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. శనివారం శని చాలీసా పఠించండి
  2. ఏదైనా శని దేవాలయానికి వెళ్లి ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించి ఇనుము, నూనె, నల్ల గుడ్డ లేదా నల్ల ఉసిరి దానం చేయండి.
  3. ఏ లి నాటి శని ప్రభావంని నివారించడానికి, నియమాలు, నిబంధనల ప్రకారం ఏడు ముఖాల రుద్రాక్షను ధరించండి.
  4. శనిదేవుని అనుగ్రహం పొందడానికి, శనివారం నాడు ధాతుర మూలాన్ని ధరించండి.
  5. శనివారం ఉదయం పూట రావి చెట్టుకు నీరు సమర్పించి సాయంత్రం చెట్టు కింద దీపం వెలిగించాలి.
  6. హనుమంతుడిను పూజించి, హనుమాన్ చాలీసా పఠించి హనుమాన్ అనుగ్రహాన్ని పొందండి.
  7. శనివారం నాడు మద్యం, మాంసం, చేపలు మొదలైన తామసిక ఆహారానికి దూరంగా ఉండండి..
  8. ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి.. ఇలా చేయడం శనీశ్వరుడు సంతోషిస్తాడు.
  9. వృద్ధులు, పేదలు, శ్రామికులు , నిస్సహాయ వ్యక్తికి సహాయం చేయండి.
  10. చీమలు, చేపలకు ఆహారాన్ని అందించండి. ఈ చర్య శనీశ్వరుడి ప్రతికూల ఫలితాలను తగ్గిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Loading...
Unable to load recommendations.
Follow Us