వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. తొమ్మిది గ్రహాల్లో రాహు గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాహువును ఛాయ గ్రహంగా పరిగణిస్తారు. నీడ గ్రహం అయినప్పటికీ.. ఇది ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. రాహువును అంతుచిక్కని గ్రహం అని కూడా అంటారు. ఎవరి జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉంటే వారు తరచుగా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రాహువు శుభ స్థానంలో ఉంటే ప్రజల జీవితాలను మారుస్తుంది. రాహువు దాదాపు 18 నెలలపాటు ఒక రాశిలో ఉంటాడు. అదే రాశికి తిరిగి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
రాహు సంచార ప్రభావం
రాహు గ్రహం వివిధ మార్గాల్లో వ్యక్తుల జాతకాన్ని ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 30న రాహువు మేషరాశిని విడిచి మీనరాశిలోకి ప్రవేశించాడు. రాహువు ఇప్పుడు 18 మే 2025 వరకు మీన రాశిలో ఉంటాడు. దీని తరువాత రాహువు మీనరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మీనం నీటి మూలక సంకేతం.దీంతో ఆర్థిక లాభాలతో పాటు మెరుగైన ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి: రాహు గ్రహం వృషభరాశిలోకి ప్రవేశించడం చాలా శుభప్రదం. ఈ కాలంలో వృషభ రాశికి చెందిన వ్యక్తులు అపారమైన సంపద, శ్రేయస్సు పొందుతారు. ఆర్థిక విషయాలపై నియంత్రణ కలిగి ఉంటారు. వాహన సౌఖ్యం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆస్తి పెట్టుబడి పెరుగుతుంది. పొదుపు కూడా చేస్తారు.
మిథున రాశి: మిథున రాశి వారికి రాహు సంచారం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిధున రాశి వారికి ఖర్చులు పెరగవచ్చు. ఆదాయ వనరుల నుంచి తగిన డబ్బు కూడా వస్తూనే ఉంటుంది. మొత్తంమీద మిథున రాశి వారిపై రాహువు ప్రభావం బాగానే ఉండబోతోంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వ్యక్తుల జాతకంలో ఐదవ ఇంట్లో రాహువు సంచరిస్తాడు. దీంతో ప్రజలు అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. మూలధన పెట్టుబడికి మంచి సమయం. కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బులు లభించే అవకాశం కూడా ఉంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు