Rahu Ketu: జాతకంలో రాహు, కేతు దోషమా..! 18 శనివారాలు ఈ పరిహాలు చేసి చూడండి .. అడ్డంకులు తొలగిపోతాయి

|

Sep 28, 2024 | 4:53 PM

నవ గ్రహాల్లో రాహువు, కేతువులు ఛాయా గ్రహాలు అని నమ్మకం. ఈ గ్రహాలు ఎవరి జాతకంలోనైనా సరే తప్పు స్థానానికి వస్తే.. ఆ వ్యక్తి చాలా చెడు పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శనివారం రాహు కేతులను శాంతింపజేయడానికి కొన్ని చర్యలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీటిని పాటించడం ద్వారా జీవితంలో ఉపశమనం లభిస్తుంది.

Rahu Ketu: జాతకంలో రాహు, కేతు దోషమా..! 18 శనివారాలు ఈ పరిహాలు చేసి చూడండి .. అడ్డంకులు తొలగిపోతాయి
Rahu Ketuvu
Follow us on

కొంత మంది జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వస్తాయి… అంతా బాగానే ఉందిఅనుకుని రిలాక్స్ అయ్యే సమయంలో అకస్మాత్తుగా కష్టాలు చుట్టుముట్టేస్తాయి. జీవితంలో ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి. అసలు తమ జీవితంలో ఏమి జరుగుతుంది అని అర్థం చేసుకోకముందే..అడ్డంకుల పరంపర ఒకదాని తర్వాత ఒకటి కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే ఇలా కష్టాలు కడలి చుట్టుముట్టడంలో రాహువు, కేతువులకు పాత్ర ఉండవచ్చు. నవ గ్రహాల్లో రాహువు, కేతువులు ఛాయా గ్రహాలు అని నమ్మకం. ఈ గ్రహాలు ఎవరి జాతకంలోనైనా సరే తప్పు స్థానానికి వస్తే.. ఆ వ్యక్తి చాలా చెడు పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శనివారం రాహు కేతులను శాంతింపజేయడానికి కొన్ని చర్యలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీటిని పాటించడం ద్వారా జీవితంలో ఉపశమనం లభిస్తుంది.

రాహు కేతువులు ఎవరంటే?

రాహు, కేతువుల కథ సముద్ర మథనానికి సంబంధించినది. సముద్ర మథనం సమయంలో స్వరభానుడు అనే రాక్షసుడు అమృతం తీసుకోవడానికి దేవతలు కూర్చున్న వరసలో సూర్యుడు, చంద్రుడు మధ్య కూర్చున్నాడు. ఈ విషయన్ని సూర్యుడు, చంద్రుడు మొహినీ దేవి రూపంలో ఉన్న విష్ణువుకి తెలియజేశారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వరభానుడుపై దాడి చేశాడు. అప్పుడు స్వరభానుడు తల శరీరం నుండి విడిపోయింది. అయితే అప్పటికే అమృతం చుక్కలు గొంతు దిగడంతో తల, మొడెం ప్రాణాలతో ఉన్నాయి. అప్పుడు స్వరభానుడు తల భాగాన్ని రాహువు అని, మొండెం భాగాన్ని కేతువు అని అంటారు. జ్యోతిష్యంలో ఈ రెండు గ్రహాలను ఛాయా గ్రహాలని .. ఎవరి జాతకంలోనైనా రాహు కేతువుల కలయిక చాలా ప్రమాదకరమైనదని చెబుతారు. ఈ కలయిక వ్యక్తి మొత్తం జీవితాన్ని కదిలిస్తుంది. రాహు, కేతు కలయిక వలన గురు చండాల యోగం, కాల సర్ప యోగం, కపట యోగం, అంగారక యోగాలు ఏర్పడి మనిషి జీవితంపై చాలా చెడు ప్రభావం చూపుతాయి.

పరిష్కారం ఎలా పొందాలంటే

రాహు కేతువుల అడ్డంకులను తొలగించడానికి శనివారం కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రోజున శనిశ్వరుడిని పూజించడం వల్ల ప్రయోజనం పొందడమే కాకుండా శివుడిని పూజించడం వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం కూడా ప్రయోజనకరం. ఈ రోజు నూనె దానం చేయవచ్చు. అంతే కాకుండా ఈ రోజున నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఈ రోజున ఉసిరికాయలు, దుప్పటి, చెప్పులు, కొబ్బరికాయను కూడా దానం చేయవచ్చు.

ఏ మంత్రాలు ప్రయోజనకరంగా ఉంటాయి?

రాహు-కేతు ఉపశమనం కోసం చాలా ప్రయోజనకరమైన మంత్రాలు ఉన్నాయి. రాహువు సృష్టించే ఇబ్బందులను తొలగేందుకు శనివారం “ఓం భ్రం భ్రూం భ్రూం సహ రాహవే నమః” అనే మంత్రాన్ని 18 శనివారాలు జపిస్తే ఫలితం ఉంటుంది. అంతేకాదు కేతువు అనుగ్రహం కోసం ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని 18 శనివారాలు జపిస్తే.. జాతకంలో కేతువు వల్ల కలిగే అడ్డంకులను తొలగించడంలో మీకు సహాయపడుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి