Maha Bhagya Yoga: మీన రాశిలో రాహువు సంచారం.. ఆ రాశుల వారికి మహాభాగ్య యోగం పట్టే అవకాశం..!

| Edited By: Janardhan Veluru

Mar 15, 2024 | 8:20 PM

మీన రాశిలో చాలా కాలంగా సంచారం చేస్తున్న రాహువు మే నెలాఖరు వరకూ ఒంటరిగా ఉండే అవకాశం కనిపించడం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు రాహువు తన ప్రతాపమంతా చూపించి అవయోగాలను, అశుభ యోగాలనే ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే, ఇప్పుడు ఏదో ఒక గ్రహం తోడుగా ఉండడం వల్ల తప్పనిసరిగా కొన్ని రాశులకు రాజయోగాలనివ్వడం జరుగుతోంది.

Maha Bhagya Yoga: మీన రాశిలో రాహువు సంచారం.. ఆ రాశుల వారికి మహాభాగ్య యోగం పట్టే అవకాశం..!
Maha Bhagya Yoga
Follow us on

మీన రాశిలో చాలా కాలంగా సంచారం చేస్తున్న రాహువు మే నెలాఖరు వరకూ ఒంటరిగా ఉండే అవకాశం కనిపించడం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు రాహువు తన ప్రతాపమంతా చూపించి అవయోగాలను, అశుభ యోగాలనే ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే, ఇప్పుడు ఏదో ఒక గ్రహం తోడుగా ఉండడం వల్ల తప్పనిసరిగా కొన్ని రాశులకు రాజయోగాలనివ్వడం జరుగుతోంది. రవి, బుధుడు, శుక్రుడు, కుజ గ్రహాల్లో ఏదో ఒక గ్రహం రాహువును అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఈ గ్రహం క్యారెక్టర్ పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి రాహువు పూర్తి యోగకారక గ్రహంగా మారిపోవడం వల్ల, ఉద్యోగంలో అందలాలు ఎక్కడానికి, ప్రాధాన్యం, ప్రాభవం పెరగడానికి, ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నష్టాల్లో, సమస్యల్లో ఉన్న వృత్తి, వ్యాపారాలు కూడా లాభాలబాట పడతాయి. ఈ రాశుల వారికి మహాభాగ్య యోగం పట్టే సూచనలున్నాయి.

  1. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ఈ రాశివారిని కెరీర్ పరంగా, ఆదాయ పరంగా, సామాజికంగా కూడా తప్పకుండా అందలాలు ఎక్కిస్తుంది. సర్వత్రా ప్రాభవం, ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి, వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరగడానికి అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు, శుభ పరిణామాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు అంచనాలకు మించి ‘ఘన’ విజయాలు సాధిస్తాయి.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగాల్లో అధికారం చేపట్టడం గానీ, ఒక సంస్థకు అధిపతి కావడం గానీ జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా అతి వేగంగా పురోగతి చెందే సూచనలున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి ఆర్థిక ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. సామాజికంగా పలుకుబడి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు సంచారం వల్ల, దీనితో శుభ గ్రహాలు యుతి చెందుతుండడం వల్ల విదేశీ సంబంధమైన శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. విదేశీయానం, విదేశాల్లో ఉద్యోగాలు, విదేశీ భాగస్వామ్యం, విదేశాల్లో స్థిరపడిన వారితో పెళ్లి సంబంధాలు, విదేశాల్లో స్థిర నివాసం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద విదేశీ సొమ్మును అనుభవించే యోగం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పితృమూలక ధన లాభం ఉంది.
  4. కన్య: ఈ రాశికి సప్తమంలో రాహు సంచారం, దానితో శుభ గ్రహాల యుతి కారణంగా ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన ధన లాభం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరత్వం లభి స్తుంది. వృత్తి, ఉద్యోగాలవారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు గడించే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. సంపద బాగా పెరుగుతుంది.
  5. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న రాహువుతో ఏ గ్రహం కలిసినా తప్పకుండా రాజ యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ సంబంధమైన సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. వీటికి క్షణం కూడా తీరిక, విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
  6. మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రాహువుతో ఇతర గ్రహాల యుతి వల్ల ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ తప్పకుండా వెగవంతమైన పురోగతి ఉంటుంది. కెరీర్ పరంగా ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు, ఆదాయ వృద్ధి కూడా ఉంటుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల, పర్యటనల వల్ల లాభం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.