గ్రహాల సంచారం గురించి జ్యోతిష్యంలో వివరించబడింది. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి గ్రహం సంచారం జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. గ్రహ సంచార పరంగా కూడా 2025 సంవత్సరం చాలా ముఖ్యమైనది. 2025 సంవత్సరం ప్రారంభంలో రాహువు, గ్రహాల యువరాజు బుధుడు కలయిక జరగనుంది.
జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 27, 2025న బుధ గ్రహం మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి 11:46 నిమిషాలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే రాహువు, బుధుని కలయిక ఏర్పడనుంది. దీంతో మొత్తం 12 రాశుల వారు రాహువు, బుధ గ్రహాల కలయిక వలన ప్రభావితమవ్వనున్నాయి. అయితే ఈ సమయంలో మూడు రాశుల వారు విశేష ప్రయోజనాలను పొందుతారు. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశి వారికి 2025వ సంవత్సరంలో రాహువు, బుధుని కలయిక ప్రత్యేకం. వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలు లభించనున్నాయి. ఈ సమయంలో వృషభ రాశి వారు తమ కెరీర్‌కు సంబంధించి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో పని చేసే ఉద్యోగస్తులు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి: 2025 సంవత్సరంలో రాహువు, బుధుల కలయిక తుల రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సమయంలో కెరీర్‌లో ఎదుగుదలకు అనేక అవకాశాలు లభించనున్నాయి. పరిశోధన, సాంకేతిక పనులలో విజయం సాధించవచ్చు. వ్యాపారానికి సంబంధించి ఈ రాశివారు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నా.. కొత్త సంవత్సరంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: కొత్త సంవత్సరంలో ఏర్పడిన రాహు, బుధ గ్రహాల కలయిక వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో వ్యాపారంలో భాగస్వాములు కావడం ద్వారా లాభాలను పొందవచ్చు. వృశ్చిక రాశి వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. వివాహితులు 2025 సంవత్సరంలో సంతోషకరమైన జీవితాన్ని గడపనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.