Rahu and Ketu Effects
ఈ నెల 18వ తేదీ నుంచి ఏడాది చివరి వరకూ రాహు కేతువులు కొన్ని రాశులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా వ్యవహరించబోతున్నాయి. ఇందులో రాహువు మీన రాశిలోని ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ, కేతువు ఉత్తరా నక్షత్రంలోనూ సంచారం చేయడం ఒక విశేషం కాగా, ఈ రెండు రాక్షస గ్రహాలకు గురువైన శుక్రుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం మరో విశేషం. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశులకు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభిస్తుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. కెరీర్ పరంగా ప్రాధాన్యం, ప్రాభవం లభిస్తాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ నూటికి నూరు పాళ్లు నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నందువల్ల జీవితం దాదాపు నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా లాభదాయకం అవుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడ తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు పరిష్కారం లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నందువల్ల సౌకర్యాలకు, సుఖ సంతోషాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాల్లో కొద్ది ప్రయత్నం అత్యధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఏ ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో భారీ లాభాలు చేతికి అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యో గంలో ఊహించని పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒక పద్దతి ప్రకారం వ్యవహరించి నష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో రాహువు, వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల అనేక శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగి, సంపద వృద్ధి చెంది, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుం టారు. అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి. శుభ కార్యాలను నిర్వహించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.
- మకరం: ఈ రాశికి తృతీయంలో రాహువు, భాగ్య స్థానంలో కేతువు అనుకూల సంచారం వల్ల తప్పకుండా సంపద వృద్ది చెందుతుంది. ఆస్తిపాస్తులు కొనే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలుగు తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించే సూచనలున్నాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో హోదాతో పాటు ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువుల అనుకూల సంచారం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. ఆకస్మిక దన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక అవస రాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమ స్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో అను కూలతలు పెరుగుతాయి. మాటకు విలువ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలు పండిస్తాయి.