
Lucky Zodiac Signs
Telugu Astrology: ఈ నెల 13న చోటు చేసుకోబోతున్న హోలీతో మొదలుకుని కొన్ని రాశుల వారికి ఏప్రిల్ 15 వరకు కలలో కూడా ఊహించని శుభ యోగాలు పట్టబోతున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో మీన, కన్యా రాశుల్లో సంభవించబోతున్న పాక్షిక చంద్ర గ్రహణం కూడా ఈ యోగాలకు చాలావరకు దోహదం చేస్తోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశం లేనప్పటికీ, జ్యోతిషశాస్త్రం ప్రకారం, దాని ప్రభావం మాత్రం జాతక చక్రాల మీద తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశుల వారు ఈ పాక్షిక చంద్ర గ్రహణంతో అనేక శుభ ఫలితాలను అనుభవించబోతున్నారు.
- వృషభం: రాజయోగాలకు కారకులైన చంద్ర, రవులు పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఈ రాశికి అనేక విధాలుగా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. తండ్రి కారణంగా సంపద పెరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- మిథునం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతున్నందువల్ల ఉద్యోగ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. అంచనాలకు మించి జీతభత్యాలు పెరుగుతాయి. సమర్థతకు, పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అత్యధిక లాభాలనిస్తాయి.
- కర్కాటకం: ఈ రాశికి మూడు, తొమ్మిదవ స్థానాల్లో గ్రహణం చోటు చేసుకోవడం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి, చంద్రుల పరస్పర వీక్షణ ఏర్పడుతున్నందువల్ల అనేక సమస్యలు, వివాదాల నుంచి విజయవంతంగా బయటపడతారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు లాభాల పంట పండిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- మకరం: ఈ రాశికి తృతీయ, నవమ స్థానంలో చంద్ర గ్రహణం సంభవించబోతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న రవి మీద చంద్రుడి దృష్టి పడడం వల్ల ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. బంధువుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగుల కల నెరవేరుతుంది.