Panchagrahi Yoga: మేషరాశిలో ఏర్పడిన పంచగ్రహి యోగం.. గురువు సంచారంతో 4 రాశులకు డబ్బే డబ్బు..

|

Apr 22, 2023 | 10:29 AM

అక్షయ తృతీయ రోజున మేషరాశిలో ఏర్పడిన పంచగ్రహి యోగం సానుకూల ప్రభావంతో నాలుగు రాశులకు లక్ ని తెస్తోంది. (ఏప్రిల్ 22న) ఈ రోజు ఉదయం 06:12 గంటలకు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు.  బృహస్పతి 01 మే 2024 వరకు మేషరాశిలో ఉంటాడు. అనంతరం వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు.   

Panchagrahi Yoga: మేషరాశిలో ఏర్పడిన పంచగ్రహి యోగం.. గురువు సంచారంతో 4 రాశులకు డబ్బే డబ్బు..
Panchagrahi Yoga
Follow us on

జ్యోతిషశాస్త్రపరంగా నేడు దేవగురువు బృహస్పతి తన రాశిని మార్చుకోనున్నాడు. బృహస్పతి మీన రాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలో కుజుడు ప్రవేశించగానే పంచగ్రహి యోగం ఏర్పడుతుంది. మేషరాశిలో బృహస్పతి, సూర్యుడు, బుధుడు, రాహువు, యురేనస్ ఉండటం వల్ల పంచగ్రహీ యోగం ఏర్పడుతుంది. బృహస్పతి మేషరాశుల కలయికతో ఏర్పడిన పంచగ్రాహి యోగం మేషం, సింహం, వృషభం,  కర్కాటక రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశి వ్యక్తుల జీవితాల్లో భారీ మార్పులు వస్తాయి.

అక్షయ తృతీయ రోజున మేషరాశిలో ఏర్పడిన పంచగ్రహి యోగం సానుకూల ప్రభావంతో నాలుగు రాశులకు లక్ ని తెస్తోంది. (ఏప్రిల్ 22న) ఈ రోజు ఉదయం 06:12 గంటలకు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు.  బృహస్పతి 01 మే 2024 వరకు మేషరాశిలో ఉంటాడు. అనంతరం వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు.

ఈ రోజు నుంచి వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు నిర్వహించేందుకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. మేషరాశిలో గురు, రాహువు కలయిక వల్ల గురు చండాల యోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగం ఈ సంవత్సరం అక్టోబర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత రాహువు మేషరాశిని విడిచిపెడతాడు.

ఇవి కూడా చదవండి

ఈ రాశులపై పంచగ్రహి యోగం 

మేష రాశి: అక్షయ తృతీయ రోజున మేషరాశిలో ఏర్పడిన పంచగ్రహి యోగం మేష రాశి వారికి శుభప్రదం అవుతుంది. కీర్తిని పొందుతారు. కీర్తి కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. వ్యాపారస్థులు మంచి లాభాన్ని పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు ఆకస్మిక ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు మీ ఆర్థిక పరిస్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కాలక్రమేణా బలంగా ఆర్ధికంగా మంచి స్టేజ్ చేరుకుంటారు.

వృషభ రాశి: అక్షయ తృతీయ రోజున ఏర్పడిన పంచగ్రహి యోగం వృషభ రాశికి చెందిన వారికి  అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు డబ్బులు ఆర్జిస్తారు. ఉన్నత పదవిని పొందవచ్చు, ముఖ్యంగా పని చేసేవారు సామాజిక ప్రతిష్టను అందుకుంటారు. లక్ష్మీదేవి ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. చేపట్టిన పని విజయవంతమవుతుంది. కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేస్తారు. ఆదాయాన్ని పొందుతారు. ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మొత్తానికి వృషభ రాశి వారికి మంచి కాలం.

కర్కాటక రాశి: కర్కాటక రాశి ప్రజలు పంచగ్రహి యోగం వల్ల ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తుల జీతం పెరుగుదల ఉంటుంది. ఇతర ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆదాయం పెరగడంతో..  బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. తద్వారా విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. సమయం కూడా వీరికి  అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా కృషికి తగిన ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనిలో  విజయం సాధిస్తారు. పనిలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపారస్థులు అధిక ప్రయోజనం పొందుతారు. మంచి లాభాలను పొందుతారు. మంచి పెట్టుబడి అవకాశం ఉంది. తద్వారా ఈ రాశివారు సంపదను పెంచుకుంటారు.

సింహ రాశి: అక్షయ తృతీయ రోజున ఏర్పడిన పంచగ్రహి యోగం సింహ రాశి వారికి అనుకూల ఫలితాలు తీసుకురానుంది. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. జీవితంలోకి అకస్మాత్తుగా డబ్బు రావడంతో మనస్సు సంతోషపడుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. అదే సమయంలో.. ఈ రాశివారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, అలా చేయడానికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ బంధం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)