AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 స్పెషల్..! ఈ తేదీల్లో పుట్టినవారి కలలు నిజమవుతాయా? భవిష్యత్తును ముందే పసిగట్టే శక్తి వీరికే అంటున్న సంఖ్యాశాస్త్రం

Root Number 7 People: సంఖ్యాశాస్త్రం ప్రకారం నెలలో 7, 16 లేదా 25వ తేదీన జన్మించిన వారి మూల సంఖ్య 7గా పరిగణిస్తారు. కేతు గ్రహ ప్రభావంతో వీరికి అద్భుతమైన అంతర్‌దృష్టి, లోతైన ఆలోచనా శక్తి ఉంటుందని నమ్మకం. మూల సంఖ్య 7 వ్యక్తుల స్వభావం, ప్రత్యేక లక్షణాలు, ఏ రంగాల్లో రాణిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకోండి.

7 స్పెషల్..! ఈ తేదీల్లో పుట్టినవారి కలలు నిజమవుతాయా? భవిష్యత్తును ముందే పసిగట్టే శక్తి వీరికే అంటున్న సంఖ్యాశాస్త్రం
Root Number 7 People
Rajashekher G
|

Updated on: Jul 23, 2026 | 5:01 PM

Share

సంఖ్యాశాస్త్రంలో (Numerology) మూల సంఖ్య (Root Number)కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని ఒక్క అంకె వచ్చే వరకు కలిపి మూల సంఖ్యను నిర్ణయిస్తారు. ఈ సంఖ్య ఆధారంగా వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, ఆర్థిక పరిస్థితి, వృత్తి, భవిష్యత్తు అవకాశాల గురించి అంచనా వేస్తారు. మూల సంఖ్యలు 1 నుంచి 9 వరకు ఉంటాయి. ప్రతి సంఖ్యకు ఒక అధిపతి గ్రహం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావం ఆయా వ్యక్తుల జీవితంపై ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అలాంటి సంఖ్యల్లో మూల సంఖ్య 7 అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంఖ్య కలిగిన వ్యక్తులకు అద్భుతమైన అంతర్‌దృష్టి (Intuition) ఉంటుందని, కొన్ని సందర్భాల్లో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే ఊహించే సామర్థ్యం కూడా ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతారు. వీరు చూసే కలల్లో చాలా వరకు నిజమవుతాయని కూడా నమ్మకం.

మూల సంఖ్య 7 ఎలా లెక్కించాలి?

నెలలో 7, 16 లేదా 25వ తేదీన జన్మించిన వారి మూల సంఖ్య7 అవుతుంది. ఉదాహరణకు, 16వ తేదీన జన్మిస్తే 1+6 = 7, 25వ తేదీన జన్మిస్తే 2+5 = 7.

కేతు గ్రహ ప్రభావం

మూల సంఖ్య 7కు అధిపతి కేతు గ్రహం. జ్యోతిష్యంలో కేతువును ఆధ్యాత్మికత, జ్ఞానం, అంతర్‌దృష్టికి ప్రతీకగా భావిస్తారు. కనిపించని విషయాలను గ్రహించే శక్తి కేతువుకు ఉందని విశ్వసిస్తారు. అందుకే మూల సంఖ్య 7 కలిగినవారిలో కూడా లోతైన ఆలోచన, పరిశీలనా శక్తి, ముందస్తు అంచనా వేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

వీరి ప్రత్యేక లక్షణాలు

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. మోసం, వంచన వంటి వాటికి దూరంగా ఉంటారు. వీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే వారికి మంచి జరుగుతుందని, అదే బాధతో లేదా ఆవేదనతో పలికిన మాటలు కూడా నిజమయ్యే అవకాశముందని విశ్వాసం ఉంది. వీరు ఇతరుల స్వభావాన్ని సులభంగా అర్థం చేసుకోగలరు. ఎదుటివారి నిజమైన ఉద్దేశాలను త్వరగా గుర్తిస్తారు. అందువల్ల ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని చాలా సందర్భాల్లో సరైన రీతిలో నిర్ణయించగలుగుతారు.

ఏ రంగాల్లో రాణిస్తారు?

మూల సంఖ్య 7 ఉన్నవారు లోతైన అధ్యయనం, పరిశోధన, రచన, బోధన, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, తత్వశాస్త్రం వంటి రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతూ, తమ ప్రత్యేక ఆలోచనా విధానంతో గుర్తింపు పొందుతారు.

(Disclaimer: సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఈ వివరాలు సంప్రదాయ విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు నిర్ధారించబడలేదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?