May 2024 Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశి వారికి విముక్తి.. 12 రాశుల వారికి మే మాసఫలాలు ఇలా..

| Edited By: Janardhan Veluru

Apr 30, 2024 | 8:03 PM

మాస ఫలాలు (మే 1 నుంచి మే 31, 2024 వరకు): శుభ గ్రహాల అనుకూలత వల్ల మేష రాశివారికి మే నెలంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్య మైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ నెల గురు, బుధ గ్రహాలతో పాటు రాశ్యధిపతి అయిన శుక్ర గ్రహం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

May 2024 Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశి వారికి విముక్తి.. 12 రాశుల వారికి మే మాసఫలాలు ఇలా..
May 2024 Monthly Horoscope
Follow us on

మాస ఫలాలు (మే 1 నుంచి మే 31, 2024 వరకు): శుభ గ్రహాల అనుకూలత వల్ల మేష రాశివారికి మే నెలంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్య మైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ నెల గురు, బుధ గ్రహాలతో పాటు రాశ్యధిపతి అయిన శుక్ర గ్రహం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారికి నెలంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్య మైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ధన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం ఆశించినంతగా మెరుగుపడు తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. శుభ కార్యాల కారణంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగంలో అధికారం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగు తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా, అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగం మారకపోవడం వల్ల సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. విద్యార్థులకు సమయం అను కూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. శుభ పరిణామం చోటు చేసుకుం టుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ నెల గురు, బుధ గ్రహాలతో పాటు రాశ్యధిపతి అయిన శుక్ర గ్రహం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశముంది. ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తుల్లో ఉన్నవారు బిజీ అవడం, రాబడి పెరగడం జరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శత్రువులతో, పోటీదార్లతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు ధన యోగాలు పట్టడానికి కూడా అవకాశముంది. సహోద్యోగుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శుక్ర, రవి, రాశ్యధిపతి బుధుడి అనుకూల సంచారం కారణంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యా తులు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. మిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుభ గ్రహాలైన గురు, శుక్రుల అనుకూలత వల్ల నెలంగా హ్యాపీగా, సానుకూలంగా గడిచిపోయే అవకాశముంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలు చాలావరకు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపా రాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవు తాయి. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులతో చిక్కుల్లో పడతారు. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగ స్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కొందరు బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశముంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గురు, శుక్ర గ్రహాలతో పాటు రాశ్యధిపతి రవి కూడా శుభ సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దవారితో పరిచయాలు విస్తరిస్తాయి. అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట తప్పవు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అత్యధిక లాభాలు చవి చూస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. విద్యార్థు లకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

గురు, శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక సమస్యలే కాకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశముంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడతారు. వృత్తి జీవితంలో నిమిషం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాల్లోంచి తేలికగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు, కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు.డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలందుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడు, సప్తమంలో గురువు అనుకూలంగా ఉన్నందువల్ల పురోభివృద్ధికి అనేక అవకాశాలు అంది వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం ఖాయం అయ్యే అవకాశముంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. సమా జంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పకపోవచ్చు.. ప్రేమ వ్యవ హారాలు కొద్దిగా అసంతృప్తిని కలిగిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

శని, శుక్ర, బుధ గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ప్రతి ఆర్థిక ప్రయత్నమూ అనుకూలి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే సం‍స్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. ముఖ్యమైన అంశాల్లో జీవిత భాగస్వామితో సామ రస్యం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభి స్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఊహించని పురోగతికి అవకాశం ఉంది. విద్యార్థులు ఘన విజ యాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశముంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

గురు, శని, శుక్రుల శుభ సంచారం వల్ల ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ఉద్యోగజీవితంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సంతోషంగా సాగిపోతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశముంది. గృహ రుణం తేలికగా మంజూరవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ, ఆర్థిక ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

శుక్ర, రవి గ్రహాలు ఆశించిన శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. సమయం చాలా వరకు అను కూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు సంపాదిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహ ప్రయ త్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందు తుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

శుక్ర, బుధుల అనుకూలత వల్ల సంపాదన బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. తండ్రి కారణంగా ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగ జీవితం అన్ని విధాలుగానూ పురోగతి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోటీదార్ల బెడద బాగా తగ్గుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం, సఖ్యత బాగా పెరుగుతాయి.