December 2023 Horoscope: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది.. 12 రాశుల వారికి డిసెంబర్ మాసఫలాలు..

| Edited By: Janardhan Veluru

Nov 30, 2023 | 8:49 PM

మాస ఫలాలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31, 2023 వరకు): మేష రాశి వారికి డిసెంబరు మాసం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.  వృషభ రాశివారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం కూడా బాగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి డిసెంబరు మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

December 2023 Horoscope: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది.. 12 రాశుల వారికి డిసెంబర్ మాసఫలాలు..
December 2023 Horoscope
Follow us on

మాస ఫలాలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31, 2023 వరకు): మేష రాశి వారికి డిసెంబరు మాసం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.  వృషభ రాశివారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం కూడా బాగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి డిసెంబరు మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. డబ్బు బాగా కలిసి వస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆశించిన స్థాయిలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరి ష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. భరణి నక్షత్రం వారు ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లో సైతం ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మిత్రుల మూలంగా కొద్దిగా డబ్బు నష్టం జరగడం తప్ప ఇతరత్రా పెద్దగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాలు ఉండవు. రియల్ ఎస్టేట్, రైతులు, భూ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. బంధు మిత్రుల్లో ఎవరికైనా ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వంటివి చేయకపోవడం మంచిది. ఇతరుల వాద వివాదాల్లో తలదూర్చవద్దు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. రోహిణి నక్షత్రం వారికి సమయం మరింత అనుకూలంగా ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం కూడా బాగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థిక పరిస్థితులలో కూడా బాగా పురోగతి ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయ త్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. శుభ వార్తలకు, శుభ కార్యా లకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమ స్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగు తుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా శుభవార్త వింటారు. విద్యార్థు లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అయితే, గ్రహాలు ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా బాగా డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అనుకో కుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఒత్తిడి పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొన్ని కష్ట నష్టాలు తప్పక పోవచ్చు. పుష్యమి నక్షత్రం వారికి కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవ హారాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. గ్రహ బలం వల్ల అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సప్తమ శని ప్రభావం వల్ల ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సుఖ సంతోషాలు తగ్గుతాయి. అయితే, కుజ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పుబ్బా నక్షత్రం వారికి ప్రస్తుతం సమయం మరింత అనుకూలంగా ఉంది. ఈ నెల ద్వితీయార్థంలో పరిస్థితులు మరింతగా సానుకూలంగా మారతాయి. విద్యార్థులకు సమయం బాగానే ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల జీవితం చాలావరకు అనుకూలంగా ఉంటుంది కానీ, కుటుంబ జీవితం కొద్దిగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి ఆర్థికంగా బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్ప కుండా ఫలిస్తాయి. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్య లతో మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో ొక ఒకటి రెండు సమస్యల వల్ల, బంధువుల జోక్యం వల్ల ఇబ్బందులు పడతారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఉత్తరా నక్షత్రం వారు అత్యధిక ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ నెలంతా ప్రశాంతంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్వాతి నక్షత్రం వారికి రాజ యోగం పడుతుంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సద్విని యోగం చేసుకోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇంటా బయటా పని ఒత్తిడి, బాధ్యతల ఒత్తిడి బాగా ఉంటాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలు, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. మొదట్లో కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి కానీ, రోజులు గడిచే కొద్దీ వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. దాంపత్య జీవితం సజావుగా సాగిపోతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. అనూరాధ నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగు తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలితాలనిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో సాన్ని హిత్యం పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ రాశివారికి కలిసి వచ్చే కాలం ఇది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆహార విహారాల్లోనే కాకుండా, ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అయితే, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కానీ, ఇంటి వ్యవహారాలే చికాకు కలిగిస్తాయి. కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలున్నాయి. దశమాధిపతి, లాభాధిపతి అనుకూలంగా ఉన్నందు వల్ల వ్యక్తిగత ఉన్నతికి, యత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సమకూరుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు అంది వస్తాయి. అప్రయత్నంగా పెళ్లి సంబంధం కుదిరే సూచనలు న్నాయి. పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సతీమణితో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. విద్యార్థులు చదువుల్లో కొద్దిగా వెనుకబడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కాస్తంత మందకొడిగా సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త నిర్ణ యాలు, కొత్త ఆలోచనల వల్ల లాభపడడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల అండ దండలకు లోటుండదు కానీ, సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటాయి. ధన స్థానం పటిష్టంగా ఉన్నందు వల్ల ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరి స్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో పోటీదార్లు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీక రిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఎక్కువగా లాభపడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.