Money Astrology
శుభ గ్రహాలు బలంగా, అనుకూలంగా ఉంటే ఆదాయం పెరుగుతుందని, పాప గ్రహాలు బలంగా ఉంటే ఖర్చులు పెరుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులకు గురు, బుధ, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశులకు ఆదాయం వృద్ధి చెందడానికే అవకాశం ఉంది. శుభ గ్రహాల స్థితిగతులను బట్టి ఆదాయం ఏ విధంగా పెరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది. ఈ రాశులకు మరో నెల రోజుల పాటు డబ్బుకు ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో భాగ్యాధిపతి గురువు ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ధన కారకుడైన గురువు రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని వృద్ధి చేయ డం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా ఆదాయం పెరగడంతో పాటు, ఆస్తిపా స్తులు కలిసి రావడం, పిత్రార్జితం లభించడం వంటివి కూడా జరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తం మీద ధన స్థానంలో గురువు ఉన్నంత వరకు డబ్బుకు లోటుండదు.
- వృషభం: ఈ రాశికి గురు, బుధ, శుక్రులు ముగ్గురూ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం వంటి చర్యల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందు తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ప్రముఖులతో లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. ఏ ఆదాయ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి ధన స్థానంలో బుధుడు, లాభ స్థానంలో గురువు ఉండడం వల్ల అనేక మార్గాల్లో ధనం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆదాయంలో కొంత భాగాన్ని ఫేర్లు, ఆర్థిక లావాదేవీలలో మదుపు చేయడం కూడా జరుగుతుంది. మొత్తం మీద కొద్ది శ్రమతో అధిక లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో జీత భత్యాలు, అదనపు రాబడి బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి.
- కన్య: ధనాధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉండడం, భాగ్య స్థానంలో గురువు సంచారం చేస్తుండడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ప్రణాళి కాబద్ధంగా వ్యవహరించి ఆదాయాన్ని మరింతగా పెంచుకునే అవకాశం కూడా ఉంది. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా కూడా ఆదాయ వృద్ధి ఉంటుంది.
- తుల: ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం పడుతున్నందువల్ల ఆదాయం పెంచుకోవడం మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి కార్యకలాపాలకు, ఒప్పందాలకు అవకాశం ఉంది. అదనపు ఆదా యాన్ని షేర్లలో మదుపు చేయడం వల్ల, వడ్డీ వ్యాపారంలో పెట్టడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలను పొందే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయానికి సంబం ధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఆదాయం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. విదేశీ సొమ్ము అనుభ వించే యోగం కూడా ఉంది. ప్రముఖులతో, సంపన్నులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి