Parivartana Yoga: బుధ-శుక్ర పరివర్తన యోగంతో కష్టనష్టాలు..ఆ రాశుల వారు జాగ్రత్త..!

మే 15 నుంచి 29 వరకు బుధుడు, శుక్రుడు మధ్య ఏర్పడుతున్న అరుదైన పరివర్తన యోగం కొన్ని రాశుల వారికి శుభఫలితాలు ఇవ్వగా, మరికొన్ని రాశులవారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులవారు ఈ సమయంలో ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు.

Parivartana Yoga: బుధ-శుక్ర పరివర్తన యోగంతో కష్టనష్టాలు..ఆ రాశుల వారు జాగ్రత్త..!
Parivartan Yoga

Edited By:

Updated on: May 16, 2026 | 6:09 PM

ఈ నెల(మే) 15 నుంచి 29 వరకు బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరుగుతోంది. బుధుడు అధిపతి అయిన మిథున రాశిలో శుక్రుడు, శుక్రుడు అధిపతి అయిన వృషభ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ పరివర్తన యోగం కలిగింది. రెండు శుభ గ్రహాల మధ్య పరివర్తన వల్ల కొన్నిరాశులకు మేలు జరుగుతుంది కానీ, మరికొన్ని రాశులకు ఈ పరివర్తన దుస్థానాల్లో జరగడం వల్ల ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రకాల కష్టనష్టాల పాలయ్యే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

  1. మేషం: శుక్ర, బుధుల పరివర్తన వల్ల ఈ రాశివారు బంధుమిత్రుల కారణంగా ఆర్థికంగా బాగా మోసపోయే లేదా నష్టపోయే అవకాశం ఉంది. వీరు ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోక పోవడం మంచిది. దీనివల్ల కష్టనష్టాల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తి వివాదాల్లో, కోర్టు కేసుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదనపు ఆదాయానికి ప్రయత్నించడంలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
  2. మిథునం: రాశినాథుడైన బుధుడికి వ్యయాధిపతి శుక్రుడితో పరివర్తన జరగడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఏదో ఒక కారణంగా చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ప్లాన్లు, పథకాలు ఫలించే అవకాశం ఉండదు. ఆర్థిక, ఆస్తి ఒప్పందాల మీద సంతకాలు చేయకపోవడం చాలావరకు మంచిది.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభ, వ్యయాధిపతులైన బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాల్లో బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశివారు సహజ సిద్ధంగా తెలివిగలవారే అయినప్పటికీ, ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు చేయడానికి, తప్పట డుగులు వేయడానికి, బోర్లాపడడానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇతరుల కోసం రుణాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
  4. తుల: ఈ రాశికి అష్టమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల శుభవార్తల కంటే దుర్వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఏ పనిలో నైనా, ఏ ప్రయత్నంలోనైనా వ్యయప్రయాసలు ఎక్కు వగా ఉంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బంధు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వాగ్దానాలు చేయడం వల్ల, హామీలు ఉండడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. ప్రయాణాల వల్ల నష్టపోతారు. ఇతరులు బాగా ఉపయోగించుకుంటారు.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ, అష్టమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆర్థిక విషయాల్లో తప్పట డుగులు, ఆస్తి వివాదాల్లో పొరపాట్లు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు నష్ట దాయకంగా పరిష్కారమవుతాయి. ఒప్పందాలు కుదర్చు కోకపోవడం మంచిది. ఆస్తిపాస్తుల కొనుగోలు ప్రయత్నాలకు, గృహ, వాహన ప్రయత్నాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. సన్నిహితులు సైతం నమ్మక ద్రోహానికి పాల్పడే అవకాశం ఉంది. వివాహ సమస్యలు తలెత్తుతాయి.
  6. మకరం: ఈ రాశికి పంచమ, షష్టాధిపతులైన బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పొరపాట్లకు పాల్పడే అవకాశం ఉంది. నష్టదాయక వ్యవహారాలతో ఇబ్బందిపడతారు. పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభించకపోవచ్చు. ఉద్యోగంలో పదోన్నతులకు అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా తగ్గే అవకాశం ఉంది.
Follow Us