Budha Vakri
ప్రస్తుతం ధనూ రాశిలో సంచరిస్తున్న బుధ గ్రహం వక్రగతి పట్టడం ప్రారంభించింది. ఈ వక్రగతి ధనూ రాశిలో ఈ నెల 30 వరకూ కొనసాగుతుంది. తెలివితేటలకు, సమయస్ఫూర్తికి, విజ్ఞానానికి కారకుడైన బుధ గ్రహం వక్రించడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తరచూ ప్లాన్లు మార్చేయడం, వేగంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఒక్కొక్కప్పుడు సమస్యలు తెచ్చి పెడతాయి. ఆరు రాశుల వారి మీద బుధుడి వక్ర ప్రభావం పడుతోంది. ఆ రాశులవారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏవైనా కష్టనష్టాలు ఎదురైతే వినాయకుడికి ప్రార్థనలు, పూజలు చేయడం వల్ల అవి పరిహారం అవుతాయి. బుధుడి వక్రగతి వల్ల ఇబ్బంది పడే రాశులుః వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం.
- వృషభం: ఈ రాశివారికి ద్వితీయ, పంచమ స్థానాలకు అధిపతి అయిన బుధుడు వక్రించడం వల్ల అనుకో కుండా కొన్ని తప్పటడుగులు వేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, కుటుంబ వ్యవహా రాల్లో సైతం పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఆలోచనలు దారి తప్పే సూచనలున్నాయి. పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎక్కడా ఒప్పందాల మీద సంతకాలు చేయ వద్దు. ఎవరికైనా ఆర్థికపరంగా హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం కూడా మంచిది కాదు.
- మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు వక్రించడం వల్ల స్నేహితుల వల్ల మోసపోవడం, వారు తప్పు దారి పట్టించడం వంటివి జరుగుతాయి. అరచేతిలో వైకుంఠం చూపించే వ్యక్తులు చుట్టూ చేరతారు. సతీమణి విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అవమానించడం, వాగ్వాదా లకు దిగడం వంటివి కూడా జరగవచ్చు. కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. గృహ, వాహన సంబంధమైన విషయాల్లో అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో దెబ్బతినడం జరుగు తుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ, తీసుకోవడం గానీ చేయకపోవడం మంచిది. బంధువు లకు సహాయం చేసి మాటలు పడడం జరుగుతుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టు కునే అవకాశం ఉంటుంది. అనవసరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఖర్చులతో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు నాలుగవ స్థానంలో వక్రించడం వల్ల కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు పరిష్కారం కాకపోగా, అవి మరింతగా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో తీవ్ర స్థాయిలో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతానికి మౌనంగా ఉండడం చాలా మంచిది. ఏ మాట మాట్లాడినా తప్పుడు అర్థాలకు దారితీసే అవకాశం ఉంది. ఇక వృత్తి, ఉద్యోగాలలో కూడా అధికారులు, సహచరులతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది.
- తుల: ఈ రాశివారికి తృతీయ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల మిత్రులు, సన్నిహితులతో అపార్థాలు తలెత్తుతాయి. కొందరు ముఖ్యమైన స్నేహితులు దూరమయ్యే సూచనలున్నాయి. ‘కమ్యూనికే షన్’ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి మాట మాట్లాడినా అది చెడు మాటగా వినిపి స్తుంది. ప్రయాణాలను వీలైనంతగా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల నష్టపోవ డమే తప్ప ప్రయోజనమేమీ కనిపించదు. తోబుట్టువులతో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం పరుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మోసగించడం, అప్పుగా డబ్బు తీసుకుని ఎగ్గొట్టడం, డబ్బు కొట్టేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. మనసులోని రహస్యాలను బయటపెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎక్కడా ఎటువంటి ఒప్పందాలూ చేసుకోవద్దు. కొత్త పనులు తలపెట్టవద్దు. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు.