AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Margi 2026: బుధుడి కటాక్షం.. వారికి కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి!

Mercury Turns Direct in Gemini: మిథున రాశిలో బుధుడు సవ్యదిశలో సంచారాన్ని ప్రారంభించడంతో జూలై చివరి నుంచి ఆగస్టు 5 వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. భద్ర రాజయోగం ప్రభావంతో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి, కొత్త అవకాశాలు, ధనలాభం, కెరీర్‌లో విజయాలు సాధించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Budh Margi 2026: బుధుడి కటాక్షం.. వారికి కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి!
Budh Margi In Mithun Rasi 2026
Janardhan Veluru
|

Updated on: Jul 23, 2026 | 4:48 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజకుమారుడైన బుధుడు (Mercury) మేధస్సు, షేర్లు, వ్యాపారం, కమ్యూనికేషన్, విద్య, ఆర్థిక వ్యవహారాలకు కారకుడిగా పరిగణిస్తారు. తన స్వక్షేత్రమైన మిథున రాశి (Gemini)లో వక్ర సంచారాన్ని వీడనున్న బుధుడు..శుక్రవారం (24 జూలై) నుంచి సవ్యదిశలో సంచారాన్ని ప్రారంభించనున్నాడు. దీని ప్రభావంతో ఆగస్టు 5, 2026 వరకు కొన్ని రాశుల వారికి విశేష శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ కాలంలో బుధుడి ప్రభావంతో భద్ర రాజయోగం బలపడటంతో కెరీర్, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపించనుంది.

బుధుడు సవ్యదిశలో సంచారాన్ని ప్రారంభించడంతో గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు, విద్యార్థులు, ఐటీ, మీడియా, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత పెరగడంతో పాటు కొత్త అవకాశాలు కూడా లభించే సూచనలు ఉన్నాయి.

ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు..?

ఇవి కూడా చదవండి

మేష రాశి: బుద్ధి కారకుడైన బుధుడు మిథున రాశిలో సవ్యదిశలో సంచారాన్ని ప్రారంభించడంతో ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు తలుపుతట్టే అవకాశముంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం.

మిథున రాశి: ఈ రాశి వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాల్లో పురోగతికి అవకాశముంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది.కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి.

సింహ రాశి: ఈ రాశి వారికి ధనలాభాలకు అవకాశముంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడికి అవకాశముంది. కొత్త ఆదాయ వనరులు సమకూరే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.

కన్య రాశి: ఈ రాశి వారికి కెరీర్‌లో గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి.

తుల రాశి: సోషల్ మీడియా, డిజిటల్, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీ సంబంధిత పనుల్లో పురోగతి సాధిస్తారు. కొత్త పరిచయాలు ప్రయోజనం చేకూరుస్తాయి.

బుధుడు బలంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు బలమైన స్థితిలో ఉంటే.. ఆ రాశి వారికి మేధాశక్తి పెరుగుతుంది. మాట్లాడే తీరు ఆకర్షణీయంగా మారుతుంది. వ్యాపార నిర్ణయాలు విజయవంతమవుతాయి. చదువులు, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.

(గమనిక: పైన పేర్కొన్న జ్యోతిష్య ఫలితాలు సాధారణ గ్రహగోచారాల ఆధారంగా ఇవ్వబడినవి. వ్యక్తిగత జాతకంలోని లగ్నం, ఇతర గ్రహాల స్థితిని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని గమనించగలరు)

Follow Us