బుధ, చంద్రుల పరివర్తన… వారి ఆశలు, కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది..!

Mercury-Moon Transit: జూలై 1, 2, 3 తేదీల్లో బుధ, చంద్రుల మధ్య రాశి పరివర్తన వల్ల వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అవకాశాలు, పెళ్లి సంబంధాలు, ఆరోగ్యం మెరుగుపడతాయి. ఈ రాశుల వారికి ఆశలు, కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది. వివరాల కోసం పూర్తి వ్యాసం చదవండి.

బుధ, చంద్రుల పరివర్తన... వారి ఆశలు, కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది..!
Telugu Astrology

Edited By:

Updated on: Jun 26, 2025 | 12:04 PM

Telugu Astrology: జూలై 1, 2, 3 తేదీల్లో బుధ, చంద్రుల మధ్య మరో రకమైన రాశి పరివర్తన జరుగుతోంది. బుధుడికి చెందిన కన్యా రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేయడం జరుగుతోంది. మనసులోని కోరికలకు, ఆశలకు చంద్రుడు కారకుడు. ఆశలను, ఆశయాలను నెరవేర్చడానికి, ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు సాగించడానికి కారకుడు బుధుడు. ఈ రెండింటి మధ్యా పరివర్తన జరుగుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఆశలు, కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ విషయంలో శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి తృతీయ, పంచమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల దూరదృష్టి, సృజనాత్మకత, పట్టుదల, ఆత్మవిశ్వాసం, చొరవ బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి, ఆర్థిక ప్రయత్నాల్లో కొద్దిగా చొరవ తీసుకోవడం, రిస్కు తీసుకోవడం వంటివి జరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆదాయ వృద్ధికి బాగా పాటుబడతారు. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడికి ధనాధిపతి చంద్రుడితో పరివర్తన జరగడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
  3. కన్య: రాశ్యధిపతి బుధుడికి లాభాధిపతి చంద్రుడితో పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అనూహ్యంగా వృద్ది చెందడం, రావలసిన సొమ్ము చేతికి అందడం, మొండి బాకీలు సైతం వసూలు కావడం వంటివి జరుగుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, జూదాలు వంటివి బాగా లాభిస్తాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  4. వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన చంద్రుడితో లాభాధిపతి బుధుడికి పరివర్తన జరగడం వల్ల ధన యోగాలు, రాజయోగాలు తప్పకుండా కలుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. అదనపు ఆదాయ మార్గాలు, మదుపులు, పెట్టుబడులు బాగా లాభించే అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన చంద్రుడితో భాగ్యాధిపతి బుధుడికి పరివర్తన జరగడం వల్ల అను కోకుండా, అప్రయత్నంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
  6. మీనం: ఈ రాశికి పంచమ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ప్రేమించిన వ్యక్తితో పెళ్లి ఖాయం కావడం లేదా మొదటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరిగే అవకాశం ఉంది. విదేశీ సంబంధం కుదరడానికి కూడా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధి స్తారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.