Telugu News Astrology Mars Aspect on Jupiter 2026: Powerful Rajyoga and Wealth Gains for These Zodiac Signs
గురు, కుజుల వీక్షణ.. వారికి అనూహ్య ధన, రాజ యోగాలు పక్కా..!
Dhana Raja Yoga: ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న కుజుడు చతుర్థ దృష్టితో మిథునంలోని గురువును వీక్షించడం వల్ల కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగాలు, ధన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో వృషభం, మిథునం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఉన్నత స్థితికి ఎదిగి, అధికారంతో పాటు ఆర్థిక అభివృద్ధిని సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మే 11 వరకు మీన రాశిలో సంచారం చేస్తున్న కుజుడు చతుర్థ దృష్టితో మిథున రాశిలోని గురువును వీక్షించడం వల్ల కొన్ని రాశులకు విపరీత రాజయోగాలు, విపరీత ధన యోగాలు పట్టబోతున్నాయి. ఈ రాశులవారు తామున్న స్థితి నుంచి తప్పకుండా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. మిత్ర గ్రహాలైన కుజ, గురువుల మద్య ఏ రకమైన దృష్టి కలిగినా అది రాజయోగాలకు దారితీస్తుంది. గురువు మీద కుజుడి దృష్టి వల్ల ధన దాహం, అధికార దాహం బాగా పెరుగుతుంది. వృషభం, మిథునం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారి జీవితాల్లో అధికార యోగం, ధనాభివృద్ధి తప్పకుండా కనిపిస్తాయి.
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న గురువు మీద లాభ స్థానంలో ఉన్న కుజుడి దృష్టి పడ డం వల్ల ఉద్యోగ జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. పదోన్నతులు కలగడం లేదా మరింత మంచి ఉద్యోగంలోకి మారడం వంటివి జరుగుతాయి. ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి.
మిథునం: ఈ రాశిలో ఉన్న గురువును దశమ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఉద్యోగంలో తప్ప కుండా అధికార యోగం కలుగుతుంది. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో భారీ లాభాలకు అవకాశముంది. జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అంచనాలకు మించి ఆదాయ వృద్ధి ఉంటుంది.
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువును ఆరవ స్థానంలో నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, రాబడి వృద్ధి చెందుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. కెరీర్ పరంగా కూడా అనేక విధాలుగా ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది.
ధనుస్సు: ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువును చతుర్థ స్థానంలో నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆస్తి లాభానికి బాగా అవకాశముంది. వారసత్వ సంపద లభిస్తుంది. పితృమూలక ధన లాభం ఉంటుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ పర్యటనలు బాగా ఎక్కువగా చేయడం జరుగుతుంది.
కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో ఉన్న కుజుడు పంచమ స్థానంలో ఉన్న గురువును చూడడం వల్ల ఇంట్లో అనేక శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి చెందడం ప్రారంభమై. ఆర్థిక సమస్యలు తగ్గడం మొదలవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. తప్పకుండా మహా భాగ్య యోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువును ఈ రాశి నుంచి కుజుడు చూడడం వల్ల ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతాన యోగం కలుగుతుంది. కుటుంబంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి.