
దిన ఫలాలు (మార్చి 1, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. అలాగే మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల సహాయం అందుతుంది. వ్యక్తిగత సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగంలో బాధ్యతలు పూర్తిగా మారిపోతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయ వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్య మైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆశించిన స్థాయిలో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అదనపు పనిభారం తప్పకపోవచ్చు. అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు అప్పగిస్తారు. సహోద్యోగులతో పనులు పంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం శ్రేయస్కరం. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశముంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కొందరు బంధు మిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వస్త్రాభరణాల కొనుగోలుకు అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. ప్రాభవం పెరుగుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి జీవితంలో పురోగతికి అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపా రాలు కొద్దిగా లాభాలు గడిస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా లాభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి అడుగువేయాలి. ఆర్థిక ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడడం మంచిది కాదు. పెళ్లి ప్రయత్నాలు ఫలించి ఆశించిన సంబంధం కుదురుతుంది.
ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలు, కొత్త లక్ష్యాలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి సంపద లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. చేపట్టిన పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో కొందరు మిత్రుల సహా యం లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారాలు కొద్దిగా పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల మీద దృష్టి పెడతారు. సొంత పనుల మీద పెట్టడం అవసరం. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా కొనసాగుతుంది. మీ దగ్గర నుంచి ఆర్థికంగా సహా యం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ జీవితం చాలావరకు ఉత్సాహంగా సాగిపోతుంది.
ఉద్యోగంలో బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. తల్లితండ్రుల ద్వారా అనుకోకుండా ధన లాభం పొందుతారు. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందే అవకాశం ఉంది.