ఈ ఏడాది రెండవ చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీ పౌర్ణమి రోజున ఏర్పడనుంది. అక్టోబర్ 28వ తేదీ రాత్రి మొదలయ్యే ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 29వ తేదీ తెల్లవారు జామున ముగుస్తుంది. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం భారత దేశంలో కనిపించనుంది. దీంతో సూతకాలం ఉండనుంది. చంద్రగ్రహణ ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి జరిగితే.. అదే సమయంలో కొన్ని రాశుల వారికి కష్టాలు, ఇబ్బందులు కలగజేయనుంది. మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఈ రోజు ఈ చంద్రగ్రహణం వలన కష్టాలు పడే రాశుల గురించి తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారిపై చంద్రగ్రహణ ప్రభావం పడనుంది. కుటుంబ సభ్యులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో విబేధించే అవకాశం ఉంది. అయితే పోటీ పరీక్షల్లో పాల్గొనే స్టూడెంట్స్ ఈజీగా సక్సెస్ అందుకుంటారు.
వృషభ రాశి: ఈ వారు మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆర్ధిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు చంచల మనసుతో తీసుకునే నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మిధున రాశి: ఈ రాశి వారు ఆర్ధిక సమస్యల నుంచి ఈజీగా బయటపడనున్నారు. అంతేకాదు ఈ చంద్రగ్రహణం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఇతరుల మద్దతుతో ఎలాంటి పనులను అయినా ఈజీగా చేయగలరు.
కర్కాటక రాశి: ఈ రాశివారిపై చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం లోపించి ఆందోళనతో ఉంటారు. బంధువులు, సన్నితులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇతరులతో ఉండే సమయంలో స్వీయ నియంత్రణ ఉండాల్సి ఉందని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు.
సింహ రాశి: ఈ రాశి వారిపై చంద్రగ్రహణం పడనుంది. కొన్ని సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆత్మవిశ్వాసం తగ్గి చేపట్టిన పనులల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడి హెచ్చుతగ్గులు కలిగే అవకాశం ఉంది. అయితే మాతృత్వం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశికి చెందిన స్త్రీలు శుభవార్త వినే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.