Shani Planet: పుట్టుకతోనే శని దేవుడి అనుగ్రహం పొందే రాశులు.. వీరికి జీవితాంతం తిరుగులేదిక!

ఈ ఐదు రాశుల వారు శని దేవుడి ప్రత్యేకమైన ప్రేమను పొందుతారు. వారి జీవితంలో విజయం, సంతోషం, ఆర్థిక స్థిరత్వం ఎల్లప్పుడూ ఉంటాయి. శని అనుగ్రహం వారిని జీవితాంతం ఒక రాజులాగా చూసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి పుట్టుకతోనే శనైశ్చర్వుడి అనుగ్రహం పొందే ఆ రాశుల వారెవరు.. వీరికి ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం..

Shani Planet: పుట్టుకతోనే శని దేవుడి అనుగ్రహం పొందే రాశులు.. వీరికి జీవితాంతం తిరుగులేదిక!
Sani Planet Astrology Remedies

Updated on: May 16, 2025 | 3:32 PM

శని దేవుడు న్యాయానికి అధిపతి. నవగ్రహాలలో శనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కర్మల ఫలితాలను ఇచ్చేవాడిగా, క్రమశిక్షణకు నిలువెత్తు రూపంగా శనిని కొలుస్తారు. చాలామంది శని అంటే కష్టాలు తెస్తాడని భయపడుతుంటారు. కానీ నిజానికి క్రమశిక్షణతో, నీతిగా జీవించేవారికి శని ఎల్లప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాడు. కొన్ని రాశులపై శనికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఆ రాశుల వారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి, సకల శుభాలను కలిగిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి శని దేవుడికి అత్యంత ఇష్టమైన ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:

వృషభ రాశి వారిపై శని దేవుడి ప్రత్యేకమైన దయ ఉంటుంది. శని ఈ రాశి జాతకులను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. వారు చేసే ప్రతి పనిలోనూ తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా వాటిని ఎదుర్కొనే శక్తిని శని అనుగ్రహిస్తాడు. శని ఆశీస్సులతో ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. జీవితంలో స్థిరత్వం, అభివృద్ధిని పొందుతారు.

తులారాశి:

తులారాశి వారిపై శని దేవుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. శనికి అత్యంత ఇష్టమైన రాశులలో తులారాశి ఒకటి. శని దయ వల్ల ఈ రాశి వారు బలమైన సంకల్ప శక్తిని, ఏకాగ్రత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా శని వారిని ఎల్లప్పుడూ కాపాడుతాడు. ముఖ్యంగా శనివారం రోజున ఎవరైతే శనీశ్వరుడిని భక్తితో పూజిస్తారో వారికి శని మరింత ఎక్కువగా మేలు చేస్తాడు.

మకర రాశి:

మకర రాశి వారిపై శని కటాక్షం నిరంతరం ఉంటుంది. మకర రాశి జాతకులు శని దేవుడి ప్రేమ కారణంగా వారు ఏ పని చేసినా విజయాలను సాధిస్తారు. వారు చేపట్టిన ప్రతి పనిలోనూ సానుకూల ఫలితాలు పొందుతారు. శని ఆశీర్వాదంతో జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ప్రతి రంగంలోనూ మకర రాశి వారు విజయం సాధిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా శని వారిని చూసుకుంటాడు.

కుంభరాశి:

శని దేవుడికి అత్యంత ప్రీతికరమైన రాశులలో కుంభరాశి ఒకటి. కుంభరాశి జాతకులు శని దయ వల్ల అనేక శుభ ఫలితాలను పొందుతారు. వారు చేసే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని శని ఎల్లప్పుడూ ఇస్తాడు. ఆర్థికంగా వారికి ఎటువంటి లోటు రాకుండా చూస్తాడు. శని దేవుడి ఆశీర్వాదంతో కుంభరాశి జాతకులు జీవితాంతం సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తారు.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి జాతకులపై కూడా శని దేవుడి ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. శని ఈ రాశి వారికి జీవితాంతం ఎటువంటి కష్టాలు రాకుండా కాపాడుతాడు. వారు ఏ పని చేసినా మంచి ఫలితాలు వచ్చేలా చూస్తాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, జీవితంలో ఆనందం ఉండేలా శని దేవుడు వారిని అనుగ్రహిస్తాడు. ఈ రాశి వారికి శని ఎల్లప్పుడూ ఒక రక్షకుడిలా ఉంటాడు.