Lord Shani Dev
గురు గ్రహానికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడు ప్రవేశించి, అక్టోబర్ 2వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో కొనసాగడం జరుగుతోంది. ధన కారకుడు, సహజ భాగ్యాధిపతి అయిన గురు నక్షత్రంలో శని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా ఐశ్వర్య యోగాలు, మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందడం, ఇబ్బడిముబ్బడిగా పెరగడం, జీతభత్యాలు వృద్ధి చెందడం, షేర్లు, స్పెక్యులేషన్లు లాభించడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి అనేక విధాలుగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న లాభాధిపతి శని ధన కారకుడైన గురు నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఆస్తి వివాదం, కోర్టు కేసు నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- వృషభం: ఈ రాశికి దశమాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానాధిపతి గురువు నక్షత్రంలో సంచారం ప్రారంభించినందువల్ల ఉద్యోగపరంగా కొన్ని శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ధన యోగాలు పడతాయి. ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడు తుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కుతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవ కాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది.
- మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న భాగ్యాధిపతి శని పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి నందువల్ల ఉద్యోగ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంది. ఆదాయం కూడా బాగా పెరిగే సూచనలున్నాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల తీరు తెన్నులు మారిపోయి, లాభాల బాటపడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది.
- తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు ధన కారకుడైన గురువు నక్షత్రంలో ప్రవేశించినందు వల్ల అనేక శుభ పరిణామాలు అనుభవంలోకి వస్తాయి. తప్పకుండా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
- ధనుస్సు: తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు రాశ్యధిపతి గురువు నక్షత్రంలోకి ప్రవేశించినందువల్ల ఏ రంగంలోని వారికైనా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. సంపన్నులతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి.
- మకరం: రాశ్యధిపతి శని ధన స్థానంలో ధన కారకుడైన గురువు నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.