Telugu Astrology
జ్యోతిష శాస్త్రం ప్రకారం కేతువు వక్ర గ్రహమే కాకుండా పాపగ్రహం కూడా. కేతువు అనుకూలంగా లేనప్పుడు ఏ రాశికైనా అంతుబట్టని సమస్యలను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చికిత్స లభించని అనారోగ్యాలు, అంతుచిక్కని ఆర్థిక సమస్యలు వగైరాలను ఇవ్వడం జరుగుతుంది. కేతువు అనుకూలంగా ఉన్నప్పుడు ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్లు, స్పెక్యులేషన్లలో అత్యధిక లాభాలు, ఊహించని పదోన్నతులు సంప్రాప్తించే అవకాశం ఉంటుంది. కేతువును గురువు చూసినప్పుడు మాత్రమే ఈ గ్రహం అనుకూలంగా మారుతుంది. గురు గ్రహంతో పాటు శుక్రుడు కూడా ఫిబ్రవరి 6 నుంచి కేతువును వీక్షిస్తున్నందువల్ల మేషం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులకు నెల రోజుల పాటు అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఉన్న కేతువు మీద గురు, శుక్రుల దృష్టి పడడం వల్ల అనారో గ్యాలు, ఆర్థిక సమస్యల నుంచి ఊహించని విధంగా విముక్తి లభిస్తుంది. గురు దృష్టి కారణంగా ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, శుక్రుడి దృష్టి కారణంగా విలాసాల మీద బాగా ఖర్చయ్యే సూచనలున్నాయి. ప్రత్యర్ధులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో ఆకస్మిక అధికార లాభం కలుగుతుంది. వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగు తుంది.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కేతువు మీద ఉచ్ఛరాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడు, గురు వుల దృష్టి పడడం వల్ల తప్పకుండా ధన యోగాలు, రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యో గంలో పని ఒత్తిళ్లు, పని భారాల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ప్రతిభకు, సమర్థ తకు ఆశిం చిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు బాగా తగ్గుముఖం పడ తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న కేతువు మీద భాగ్య, లాభాధిపతుల దృష్టి పడినందువల్ల ఈ కేతువు అత్యంత శుభ గ్రహంగా మారిపోవడం జరుగుతుంది. ఫలితంగా ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా నెరవేరుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కేతువును శుభ గ్రహాలు వీక్షిస్తున్నందువల్ల అనేక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన సొమ్ముతో పాటు రాదనుకున్న డబ్బు కూడా తప్పకుండా చేతికి అందుతాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాలన్నీ సఫలమవుతాయి. ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తిపా స్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న కేతువు మీద గురు, శుక్రుల దృష్టి పడడం వల్ల సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. విదేశీయానానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యో గులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- మీనం: ఈ రాశికి సప్తమంలో ఉన్న కేతువు మీద రాశినాథుడు గురువు దృష్టి పడినందువల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కూడా విజయవంతం అవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరగడం, పదోన్నతి లభించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి.