Money Astrology
శనివారం (జులై 13) నుంచి కుజుడు స్వస్థానమైన మేష రాశిని వదిలిపెట్టి, వృషభ రాశిలో సంచారం ప్రారంభించాడు. వృషభ రాశిలోనే ఉన్న గురువుతో యుతి చెందుతాడు. కుజుడు వృషభ రాశిలో ఆగస్టు 26 వరకూ కొనసాగుతాడు. కుజ, గురువులు మిత్రులే అయినందువల్ల శుభ యోగాలు, శుభ ఫలితాలు ఇవ్వకుండా ఉండే అవకాశం లేదు. ఈ రెండు గ్రహాల యుతి వల్ల అప్రయత్న ధన లాభం, అప్రయత్న అధికార యోగం వంటివి ఎక్కువగా జరుగుతాయి. ప్రయత్నం చేయకుండానే ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి కావడానికి ఈ యుతి దోహదం చేస్తుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ యుతి కారణంగా ఇటువంటి శుభ యోగాలు పట్టడం జరుగుతుంది.
- మేషం: రాశ్యధిపతి కుజుడితో భాగ్య స్థానాధిపతి, ధన కారకుడు అయిన గురువు ధన స్థానంలో కలవడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన ప్రాప్తి కలుగుతాయి. రావ లసిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు ఇంటికి చేరుతాయి. ఉద్యో గంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో ధనపరంగా అదృష్టం పట్టడం వంటివి జరుగు తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశిలో కుజ, గురుల సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించని స్థాయి అధికార యోగం పడు తుంది. సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. జీవిత భాగస్వామి కూడా అందలాలు ఎక్కడం జరుగుతుంది. కలలో కూడా ఊహించని రీతిలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వృద్ధి చెందుతాయి. అనారోగ్యాలకు సరైన వైద్య చికిత్స లభించి మంచి ఉపశమనం కలుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాలు కలవడం వల్ల ధర్మకర్మాధిప యోగం ఏర్ప డింది. దీనివల్ల రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఏమాత్రం ప్రయత్నం చేయకుండానే అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా పలుకుబడి వృద్ధి చెందు తుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతి సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి అత్యంత శుభులైన గురు, కుజులు దశమ స్థానంలో యుతి చెందడం వల్ల ఉద్యోగ పరంగా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో కలలో కూడా ఊహిం చని పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులు వ్యాపార రంగంలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా మంచి ఆఫర్లు అందు తాయి. ఉద్యోగులకు కూడా ఆహ్వానాలు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
- వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో శుభ గ్రహం గురువు కలవడం వల్ల ఈ రాశివారికి సర్వతా ప్రాధాన్యం, గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తు లతో కలిసి తిరగడం జరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన దానికంటే ఎక్కువగా అందలాలు ఎక్కే అవకాశం ఉంది. ప్రభుత్వంలో లేదా రాజకీయాల్లో ఉన్నవారికి అంచనాలకు మించిన అవకాశాలు అందివస్తాయి. ప్రభుత్వపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యానికి చికిత్స లభ్యం అవుతుంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, గురువులు కలవడం యోగదాయకం అవుతుంది. సామాజికంగా, ప్రభుత్వపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. ప్రభుత్వం నుంచి సత్కారాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.