Kuber Yoga: కుజ, చంద్రుల యుతి.. ఆ రాశుల వారికి కుబేర యోగం..!

| Edited By: Janardhan Veluru

Nov 20, 2024 | 6:12 PM

Chandra Mangala Yoga: నవంబర్ నెల 20 నుంచి మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో కుజ, చంద్ర గ్రహాల యుతి చోటు చేసుకోబోతోంది. కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడికి రాశినాథుడు చంద్రుడి కలయిక వల్ల నీచ భంగం కలుగుతుంది. చంద్రుడికి ఇది స్వక్షేత్రమైనందువల్ల కర్కాటక రాశిలో ఈ రెండు గ్రహాల యుతి జరగడం అత్యంత యోగదాయకమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల యుతి వల్ల చంద్ర మంగళ యోగమనే కుబేర యోగం కలుగుతుంది.

Kuber Yoga: కుజ, చంద్రుల యుతి.. ఆ రాశుల వారికి కుబేర యోగం..!
Kuber Yoga
Follow us on

Telugu Astrology: ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో కుజ, చంద్ర గ్రహాల యుతి చోటు చేసుకోబోతోంది. కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడికి రాశినాథుడు చంద్రుడి కలయిక వల్ల నీచ భంగం కలుగుతుంది. చంద్రుడికి ఇది స్వక్షేత్రమైనందువల్ల కర్కాటక రాశిలో ఈ రెండు గ్రహాల యుతి జరగడం అత్యంత యోగదాయకమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల యుతి వల్ల చంద్ర మంగళ యోగమనే కుబేర యోగం కలుగుతుంది. ఈ మూడు రోజుల కాలంలో ఆదాయ వృద్ధికి, ఆస్తి వివాదాల పరిష్కారానికి, ఆస్తులను కొనడానికి సంబం ధించి ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఈ యోగ ఫలితం కనీసం పదిహేను రోజులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ యోగం మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి పట్టబోతోంది.

  1. మేషం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి కుజుడు చంద్రుడితో కకలవడంవల్ల పూర్తి స్థాయి చంద్ర మంగళ యోగం ఏర్పడింది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి సంక్ర మించే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. తల్లితండ్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అవుతుంది.
  2. కర్కాటకం: రాశినాథుడు చంద్రుడు కుజుడితో కలవడం వల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆదాయ పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూ లంగా పరిష్కారం అవుతాయి. వస్తు సంపద పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సాను కూలపడతాయి. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి.
  3. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, చంద్రుల యుతి వల్ల కుబేర యోగం ఏర్పడింది. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమై మనశ్శాంతి కలుగుతుంది. ఊహించని విధంగా భూ లాభం కలిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా విశేషంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయి పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.
  4. తుల: ఈ రాశికి దశమ స్థానంలో దశమాధిపతి చంద్రుడు, ధనాధిపతి కుజుడు కలిసినందువల్ల ఉద్యోగ పరంగానే కాక, వృత్తి, వ్యాపారాలపరంగా కూడా అపారంగా ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  5. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో భాగ్యాధిపతి చంద్రుడితో కలుస్తున్నందువల్ల ఈ కుబేర యోగం కలుగుతోంది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు ఇతర దేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యో గంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలతో పాటు ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
  6. మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో ధన, భాగ్యాధిపతి కుజుడు, పంచమాధిపతి చంద్రుడు కలవడం వల్ల పూర్తి స్థాయిలో చంద్ర మంగళ యోగం ఏర్పడింది. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపా స్తులు కలిసి వస్తాయి. ముఖ్యంగా భూలాభం కలుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.