అసూయ.. మనిషిని రాక్షసుడిగా మార్చే స్థాయికి చేరుకుంటుంది. ఇతరుల ఆనందాన్ని.. వారి ఎదుగుదలను అస్సలు సహించనివారు కొందరుంటారు. అందరు తమను గొప్పవారిగా చూడాలని.. మిగతావారు తమకంటే తక్కువే అనే అహాంకారంతో ఉంటారు. అలాంటి వారి ముఖంలో అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. తమ జీవితంపట్ల ఆనందంగా ఉండరు.. అలాగే.. ఇతరులు ఆనందంగా ఉంటే ఓర్వలేరు. తమ చుట్టూ ఉండే ఆనందాలను… విజయాలను వీరు చూడరు.. వీరు ఎక్కువగా అసూయ పడుతుంటారని అందరికీ తెలుసు. అయితే ఇది వారి స్వభావం కాదు.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. వారి వారి రాశులను బట్టి స్వభావం ఆధారపడి ఉంటుంది. మరీ ఎక్కువగా అసూయ కల్గి ఉండే రాశులు ఏంటో తెలుసుకుందామా.
వృషభ రాశి..
వీరు ఒక్కోసారి చాలా అసూయ పడుతుంటారు. కష్టపడి పనిచేస్తారు.. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించనప్పుడు.. మరొకరు విజయం సాధించినప్పుడు చాలా అసూయ పడుతుంటారు. ఇతరుల అదృష్టాన్ని శపిస్తారు. ఇతరుల అభివృద్ధిని చూసి అసూయపడతారు.
మకర రాశి..
వీరు ఇతరులను చూసి ఎప్పుడూ అసూయపడుతుంటారు. వీరి చుట్టూ ఉండేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వేరొకరు సంతోషంగా ఉంటే మాత్రం అస్సలు చూడలేరు. వీరి ముఖంలో అసూయ కనిపించకపోయినప్పటికీ.. ఇతరుల ఆనందం, విజయం చూసి అసూయపడుతుంటారు.
వృశ్చిక రాశి..
మకరం, వృశ్చిక రాశుల వారి మాదిరిగానే వీరు కూడా ఇతరుల ఆనందాన్ని చూసి అసూయపడుతుంటారు. ప్రతి చోటా తామే పెద్ద అనే అహంతో ఉంటాైరు. ఎదుటివారు విజయం సాధిస్తే చూడలేరు. వీరి మితిమీరిన అసూయతో కొన్ని సార్లు ఇతరుల ఆనందానికి.. విజయానికి అడ్డు కట్ట వేస్తారు.
ధనుస్సు రాశి..
వీరు ఎప్పుడూ అసూయతో ఉంటారు. ఇతరుల విజయాన్ని చూసి చాలా అసూయపడతారు. వీరి ముందు ఎవరైనా విజయం గురించి.. ఆనందం గురించి చెబితే వీరి కళ్లలో అసూయ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాశివారు తమను తప్ప మరొకరి విజయం సాధించడం అస్సలు చూడరు.
Also Read: Hamsa Nandini: క్యాన్సర్‌తో పోరాటం చేస్తోన్న హీరోయిన్.. సర్జరీలకు సమయం వచ్చేసిందంటూ పోస్ట్..
Bigg Boss Ultimate: బిగ్‌బాస్ షో హోస్ట్‌గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..
Viral Video: ఇదేక్కడి తెలివిరా బాబు.. ఫోన్ దొంగిలించాడు.. చివరకు ఊహించని షాక్..