Astro Tips: వజ్రం ధరించడానికి కొన్ని జ్యోతిష్య నియమాలు.. పాటించకుంటే నష్టం కోరి కొని తెచ్చుకున్నట్లే..

|

Oct 07, 2023 | 9:50 AM

వజ్రాన్ని ధరించే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే వజ్రాన్ని ధరించిన వ్యక్తికి లాభానికి బదులుగా నష్టాన్ని చవిచూడాలి.  అందుకనే వజ్రం ధరించే ముందు  జ్యోతిష్యుని సలహా తీసుకోవాలి. ఆయన సలహా మేరకు.. ఏ వేలికి, సరైన బరువుతో .. సరైన లోహంలో, శుభ సమయం రోజును పరిగణనలోకి తీసుకొని మరీ వజ్రం చేసిన ఉంగరాన్ని ధరించాలి.

Astro Tips:  వజ్రం ధరించడానికి కొన్ని జ్యోతిష్య నియమాలు.. పాటించకుంటే నష్టం కోరి కొని తెచ్చుకున్నట్లే..
Diamond Wearing Rules
Follow us on

నవరత్నాల్లో వజ్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వజ్రాన్ని రత్నాల రాజుగా పరిగణిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా రత్నాన్ని ధరించాలని కోరుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో వజ్రం శుక్ర గ్రహానికి సంబంధించిన రత్నంగా పరిగణించబడుతుంది. అంటే వృషభ, తుల రాశులకు అధిపతిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వజ్రాన్ని ధరించిన వ్యక్తి సంపదకు కొదవు ఉండదు. ధనవంతుడు అవుతాడు. వజ్రం అత్యంత విలువైన రత్నం. పారదర్శకంగా కనిపిస్తూ మెరుస్తూ ఉంటుంది.

వజ్రాన్ని ధరించడానికి జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. దీని గురించి తెలుసుకోవాలి. అంతేకాదు వజ్రాన్ని ధరించే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే వజ్రాన్ని ధరించిన వ్యక్తికి లాభానికి బదులుగా నష్టాన్ని చవిచూడాలి.  అందుకనే వజ్రం ధరించే ముందు  జ్యోతిష్యుని సలహా తీసుకోవాలి. ఆయన సలహా మేరకు.. ఏ వేలికి, సరైన బరువుతో .. సరైన లోహంలో, శుభ సమయం రోజును పరిగణనలోకి తీసుకొని మరీ వజ్రం చేసిన ఉంగరాన్ని ధరించాలి.

డైమండ్ రింగ్ ఏ వేలికి ధరించాలంటే..

ఏదైనా రత్నాన్ని కుడి చేతి చూపుడు వేలికి ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  వజ్రం ధరించడానికి కూడా కుడి చేయి చూపుడు వేలు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా తన కుడి చేతి చూపుడు వేలుకు వజ్రపు ఉంగరాన్ని ధరిస్తే అతను తన వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తాడు. సమాజంలో అతని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ఎవరైనా ఉంగరపు వేలుకు వజ్రాన్ని ధరిస్తే అది అతని వైవాహిక జీవిటం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

ఇవి కూడా చదవండి

వజ్రాన్ని ఏ రోజు ధరించాలంటే

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వజ్రాల రత్నం శుక్ర గ్రహానికి చిహ్నం. శుభం పొందడానికి, ఈ రత్నాన్ని ఏ నెలలోనైనా శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం నాడు ధరించాలి. మీరు ఈ రత్నాన్ని ధరించాలనుకుంటే, జ్యోతిష్యుని సలహా తీసుకున్న తర్వాత.. ఆశ్వియుజ మాసంలోని శుక్లపక్షంలో శుక్రవారం అనగా నవరాత్రి నాడు సూచించిన విధానం ప్రకారం ధరించవచ్చు.

వజ్రం ధరించే ముందు పఠించాల్సిన మంత్రం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు.. మంత్రాలతో ఆవాహన చేయడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో.. మీరు ఏ రూపంలోనైనా వజ్రాన్ని ధరించాలనుకుంటే.. శుక్రవారం నాడు శుక్ర గ్రహం ‘ఓం శుం శుక్రాయ నమః’ మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా శుక్రుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.