Raja Yogas: కీలక రాశుల అనుకూలత.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..!

| Edited By: Janardhan Veluru

Aug 26, 2024 | 7:03 PM

స్వస్థానమైన కుంభ రాశిలో వక్రించడం వల్ల శనీశ్వరుడు, కర్కాటకంలో వక్రించడం వల్ల బుధుడు, కన్యా రాశిలో నీచభంగం చెందినందువల్ల శుక్రుడు బాగా బలంగా ఉన్నందువల్ల ఆరు రాశులు బాగా బలపడ్డాయి. ఈ రాశుల వారికి ఆదాయ ప్రయత్నాల్లో, హోదాలు పెరగడంలో, ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడడంలో, సుఖ సంతోషాలను అనుభవించడంలో అనుకూలతలు బాగా పెరగబోతున్నాయి.

Raja Yogas: కీలక రాశుల అనుకూలత.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..!
Raja Yoga
Follow us on

స్వస్థానమైన కుంభ రాశిలో వక్రించడం వల్ల శనీశ్వరుడు, కర్కాటకంలో వక్రించడం వల్ల బుధుడు, కన్యా రాశిలో నీచభంగం చెందినందువల్ల శుక్రుడు బాగా బలంగా ఉన్నందువల్ల ఆరు రాశులు బాగా బలపడ్డాయి. ఈ రాశుల వారికి ఆదాయ ప్రయత్నాల్లో, హోదాలు పెరగడంలో, ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడడంలో, సుఖ సంతోషాలను అనుభవించడంలో అనుకూలతలు బాగా పెరగబోతున్నాయి. ప్రస్తుతానికి మరో రెండు నెలల పాటు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారి జీవితంలో ఇటువంటి శుభ పరిణామాలన్నీ జరగబోతున్నాయి. ఈ రాశుల వారు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోతుంది.

  1. వృషభం: ఈ రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో నీచభంగం పొందడం, ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు చతుర్థ స్థానంలో ఉండడం, దశమ స్థానంలో శనీశ్వరుడు బలంగా ఉండడం వల్ల వీరికి అన్ని విధాలుగానూ ప్రాభవం పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. గృహ, వాహన యోగాలకు అవ కాశం ఉంది. అనేక శుభవార్తలు వింటారు. కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  2. మిథునం: భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శని, తృతీయంలో రాశ్యధిపతి బుధుడు, చతుర్థంలో దిగ్బలం పట్టిన శుక్రుడు ఉండడం వల్ల ఈ రాశివారికి ఊహించని రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో సహో ద్యోగులను కాదని ఈ రాశివారికి పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన యోగాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. అనేక శుభవార్తలను వినడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  3. కన్య: ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడితో పాటు ధనాధిపతి శుక్రుడు కూడా అనుకూలంగా మారడం వల్ల ఏ ఆదాయ ప్రయత్నం తలపెట్టినా రెట్టింపు ఫలితం ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం వచ్చి చేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనపు ఆదాయం కూడా బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  4. తుల: ఈ రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో ప్రవేశించబోతున్నందువల్ల, బుధ, రవులు లాభ స్థానంలో చేరుతున్నందువల్ల రాజపూజ్యాలు, సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉపయోగకర పరిచయాలు విస్తరిస్తాయి. మంచి వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు కలలో కూడా ఊహించని స్పందన లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  5. మకరం: శని, బుధ, శుక్రుల అనుకూల సంచారంతో ఈ రాశికి ధన, భాగ్య స్థానాలు పటిష్ఠం అయినందు వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విదేశాల నుంచి కూడా ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.
  6. కుంభం: ఈ రాశ్యధిపతి శని స్వస్థానంలో బలంగా ఉండడం, సప్తమ స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సునా యాసంగా నెరవేరుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కలలో కూడా ఊహించని సంబంధం లభిస్తుంది. నిరుద్యోగులకు స్థిరమైన, లాభదాయకమైన ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి ఉంటుంది. వ్యాపారాలు జోరందుకుంటాయి.