Ketu Gochar 2024
వక్ర గ్రహం, పాప గ్రహం అయిన కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ ఏడాదంతో ఈ గ్రహం కన్యారాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది. కొద్ది కాలంగా ఈ గ్రహం మీద నీచ బుధుడు, కుజ గ్రహాల దృష్టి వల్ల ఈ గ్రహం తానివ్వవలసిన శుభ ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రస్తుతం వృషభ రాశిలో ప్రవేశించిన గురువు దృష్టి కేతువు మీద పడినందువల్ల ఈ పాప గ్రహం కొన్ని రాశుల వారికి శుభ గ్రహంగా మారి శుభ యోగాలనివ్వడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు అతి సమీప కాలంలో ధన యోగాలను అనుభవించే అవకాశముంది.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కేతువును గురువు వీక్షిస్తున్నందువల్ల, ఆకస్మిక ధన లాభా నికి అవకాశముంది. ప్రతిభా పాటవాలు మరింత మెరుగుపడతాయి. సరికొత్త నైపుణ్యాలను సాధిం చడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల అపారమైన లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- కర్కాటకం: తృతీయ స్థానంలో ఉన్న కేతువును లాభ స్థానం నుంచి గురువు వీక్షిస్తున్నందువల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా ధన లాభం కలుగుతుంది. రెండు మూడు పర్యాయాలు ధన యోగం పట్టే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విదేశీ ప్రయాణాలకు, విదే శాల్లో ఉద్యోగాలకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు విస్తరించే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది.
- కన్య: ఈ రాశిలో ఉన్న కేతువును భాగ్య స్థానం నుంచి గురువు వీక్షిస్తున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, వైద్యం వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. విదేశాలకు వెళ్లే వారికి బాగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. సోదర మూలక ధన లాభం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కేతువును సప్తమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల, నిరుపేదలు కూడా సంపన్నులయ్యే అవకాశముంటుంది. ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా అపార ధన లాభానికి అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం లేదా హోదా పెరగడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. జీవితం చాలావరకు సంతృప్తిగా సాగిపోతుంది.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న కేతువును పంచమ స్థానం నుంచి గురువు చూస్తున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మీ సల హాలు, సూచనలతో అధికారులు, బంధుమిత్రులు ప్రయోజనం పొందుతారు. సంతానం లేని వారికి సంతాన యోగం పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన ప్రాంతాలను సంద ర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలకు అవకాశముంది. ఆరోగ్యం బాగుంటుంది.
- మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో కేతువుపై రాశ్యధిపతి గురువు దృష్టి పడినందువల్ల, ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. సంపన్న వ్యక్తితో పెళ్లి జరిగి, జీవితం పూర్తిగా మారిపోతుంది. రాజకీ యంగా పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడే సూచనలున్నాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగిపోయి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వృత్తి జీవితంలో ధన యోగాలు కలుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.