Dhana Yoga
ఈ నెల 26, 27, 28 తేదీలలో కన్యా రాశిలో చంద్ర, కేతువులు కలిసి ఉండడం జరుగుతోంది. సాధారణంగా చంద్ర కేతువులు కలిసి ఉన్నవారికి విపరీతమైన పట్టుదల ఉంటుంది. అనుకున్నది సాధించే వరకూ నిద్రపోరు. పైగా డబ్బు తాపత్రయం బాగా ఉంటుంది. ప్రస్తుతం మూడు రోజులు పాటు ఈ రెండు గ్రహాలు కన్యారాశిలో కలిసి ఉండడం వల్ల ఆరు రాశులవారిలో సంపాదనకు సంబంధించి, డబ్బు ప్రాధాన్యానికి సంబంధించి కొత్త తపన, ఆరాటం ప్రారంభం అవుతాయి. ఈ ఆరు రాశులుః వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులు. ధన సంపాదన విషయంలో కొత్త మార్గాల కోసం ప్రయత్నాలు సాగించడం, కొత్త పద్ధతులు ప్రయత్నించడం వంటివి జరుగుతాయి. సాధారణంగా ఈ రాశుల వారు విజయాలు సాధించడమే జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర కేతువులు యుతి చెందడం వల్ల సాధారణంగా వీరి ఆలోచ నలన్నీ డబ్బు చుట్టే తిరుగుతుంటాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ‘ఏదో విధంగా’ రాబడి పెంచుకోవడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం తీరిక లేకుండా పనిచేస్తారు. ఉద్యోగంలో అదనపు సంపాదన కోసం బాగా తాపత్రయపడతారు. మరింత ఎక్కువ సంపాదనకు అవకాశం ఉండే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.
- మిథునం: ఈ రాశికి ధనాధిపతి అయిన చంద్రుడు కేతువుతో కలవడంతో వీరి ఆలోచనల్లో ఎక్కువగా ఆర్థిక వ్యవహారాలే తిరుగుతుంటాయి. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను ప్రవేశపెడతారు. ఆస్తి వివాదం పరిష్కారం చేసుకోవడానికి, ఆస్తుల్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తారు. రావా ల్సిన సొమ్మును ఏదో విధంగా రాబట్టుకోవడానికి నడుం బిగిస్తారు. ఉద్యోగంలో శ్రమను పెంచుతారు.
- సింహం: ఈ రాశివారికి ధన స్థానంలో చంద్ర కేతువులు కలవడం వల్ల సాధారణంగా డబ్బు దాచుకోవడా నికి, డబ్బును మిగల్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవ డానికి ప్రయత్నాలు సాగించడంతో పాటు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మిగులు సొమ్మును వడ్డీలకు తిప్పడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి జరుగుతాయి. ఇతరుల నుంచి రావాల్సిన బాకీలను, బకాయిలను పట్టుదలగా రాబట్టుకోవడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశివారికి లాభ స్థానాధిపతి అయిన చంద్రుడు ఈ రాశిలో కేతువును కలవడం వల్ల ‘లాభం’ లేనిదే ఏ పనీ చేయకపోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులకు ఉదారంగా సహాయం చేయడం తగ్గుతుంది. డబ్బును వడ్డీలకు తిప్పడం ఎక్కువవుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంత శ్రమకైనా, కష్టానికైనా వెనుకాడరు. ఖర్చులు తగ్గించుకోవడం, డబ్బు దాచుకోవడం, మదుపు చేయడం వంటివి ప్రారంభం అవుతాయి. ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానంలో కేతువుతో కలవడం వల్ల ఈ రాశివారు దాదాపు పిసినారిగా మారడం జరుగుతుంది. ధనం రావడమే తప్ప పోవడానికి అవకాశం ఉండదు. రావలసిన డబ్బును తర తమ భేదం లేకుండా పట్టుదలగా రాబట్టుకోవడం జరుగు తుంది. ప్రణాళికాబద్ధంగా, ఆచితూచి డబ్బును ఖర్చు పెట్టడం ప్రారంభమవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర కేతువుల యుతి వల్ల ఆదాయాన్ని పెంచుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. అవసర ఖర్చుల మీద కూడా కోత విధిస్తారు. జీవిత భాగస్వామి జీత భత్యాలకు కూడా ప్రణాళికలు రూపొందిస్తారు. షేర్లలో పెట్టుబడులు పెట్టడం, వడ్డీకి డబ్బు తిప్పడం, ఏదో విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడం వంటివి ప్రాధాన్యం సంతరించుకుంటాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..