Money Astrology: శుక్ర, గురు మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి అరుదైన ధన యోగం!

Telugu Astrology: శుభ గ్రహాలైన శుక్రుడు, గురువుల మధ్య అరుదైన పరివర్తన కొనసాగుతోంది. ఈ పరివర్తన కారణంగా కొన్ని రాశుల వారికి తప్పకుండా ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ ప్రగతి, ఆస్తి లాభాలు, వివాహ యోగాలు వంటి శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ యోగం నెల చివరి వరకు కొనసాగుతుంది.

Money Astrology: శుక్ర, గురు మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి అరుదైన ధన యోగం!
Money Astrology 2025

Edited By:

Updated on: Apr 28, 2025 | 11:32 AM

Guru Shukra Parivartan: గురు, శుక్రులు రెండూ శుభ గ్రహాలు. పైగా ధన వృద్ధికి సంబంధించిన గ్రహాలు. ఇవి రెండూ ఎప్పుడు ఎక్కడ కలిసినా, పరస్పరం చూసుకున్నా, ఒకరి రాశిలో మరొకరు ఉన్నా తప్పకుండా ధన యోగాలను కలిగిస్తాయి. ప్రస్తుతం ఈ రెండు శుభ గ్రహాల మధ్య పరివర్తన కొనసాగుతోంది. అంతేకాక, శుక్రుడు తనకు ఎంతో ఇష్టమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ, గురువు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన మృగశిరలోనూ సంచారం చేస్తున్నందువల్ల ఈ రెండు గ్రహాలకు బలం మరింతగా పెరిగింది. దీనివల్ల వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం పట్టబోతోంది. ఈ యోగం వచ్చే మ నెల 31 వరకూ కొనసాగుతుంది.

  1. వృషభం: ఇదే రాశిలో ఉన్న గురువుతో రాశ్యధిపతి శుక్రుడికి పరివర్తన జరగడంతో పాటు, ఈ శుక్రుడు ఉచ్ఛ స్థితిలో కూడా ఉన్నందువల్ల ఈ రాశివారికి ఈ నెల రోజుల కాలంలో సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఆదాయం పెరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య, లాభ స్థానాల అధిపతులైన గురు, శుక్రుల మధ్య పరివర్తన కొనసాగుతున్నం దువల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితి లభించే అవకాశం ఉంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. సగటు వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముంటుంది. భారీగా వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.
  3. కన్య: ఈ రాశికి సప్తమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన కొనసాగుతున్నందువల్ల ఈ రాశివారికి అరుదైన లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. అన్ని విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
  4. వృశ్చికం: ఈ రాశికి పంచమ, సప్తమాధిపతులైన గురు, శుక్రుల మధ్య పరివర్తన వల్ల ఉద్యోగంలో తప్ప కుండా హోదా, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది.
  5. మకరం: ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలైన గురు, శుక్రుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. సంపన్న వ్యక్తితో వివాహం నిశ్చ యం కావడం గానీ, సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించే అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశికి ద్వితీయ, చతుర్థ స్థానాల మధ్య పరివర్తన కొనసాగుతున్నందువల్ల అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ప్రముఖు లతో వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. పెద్దల నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగాల్లో జీతభత్యాలు వృద్ధి చెందుతాయి.