Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupitar Transit 2025: గురువు అనుకూలత.. ఈ ఏడాది ఆ రాశుల వారికి స్వగృహ యోగం..!

Guru Gochar 2025: 2025 మే 25లో గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల వృషభం, సింహం, కన్యతో పాటు మరికొన్ని రాశుల వారికి స్వగృహ యోగం ఏర్పడుతుంది. వీరికి సొంత ఇల్లు కొనుగోలు చేయడానికి, రుణాలు పొందడానికి అనుకూల సమయం. కొందరికి ఫ్లాట్లు, మరికొందరికి ఇండిపెండెంట్ హౌస్ లభించే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలలు గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది.

Jupitar Transit 2025: గురువు అనుకూలత.. ఈ ఏడాది ఆ రాశుల వారికి స్వగృహ యోగం..!
Own House Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 16, 2025 | 5:22 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువు గృహ కారకుడు. జాతకంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురువు అనుకూలంగా ఉన్న పక్షంలో సొంత ఇల్లు తప్పకుండా అమరుతుంది. గురువు అనుకూలంగా లేని జాతకులు అద్దె ఇళ్లలోనే ఉండిపోవడం జరుగుతుంది. మే 25న మిథున రాశిలో ప్రవేశించి, అక్కడే ఏడాది పాటు సంచారం చేయబోతున్న గురువు ఈ ఏడాది వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి సొంత ఇల్లు అనుగ్రహించే సూచనలున్నాయి.

  1. వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారు ఇప్పటి నుంచే సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. ఇందుకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరికి గృహ సంబంధమైన రుణాలు, ఆర్థిక సహాయాలు లభిస్తాయి. ఇదివరకే సొంత ఇంటిలో ఉన్నవారు మరో ఇల్లు కొనే అవకాశం కలుగుతుంది. ‘ఇండిపెండెంట్’ ఇంటికి బాగా అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఏడాది చివరలో గృహ ప్రవేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
  2. సింహం: గృహ కారకుడైన గురువు ఈ రాశికి లాభ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల తప్పకుండా గృహ యోగం కలుగుతుంది. లాభ స్థానంలోని గురువు వల్ల, జ్యోతిషశాస్త్రం ప్రకారం వీరికి ‘సౌధ ప్రాకార ప్రకాశితమైన గృహం’ కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ఫ్లాట్ ను కొనుగోలు చేయడం కన్నా ఇండిపెండెంట్ హౌస్ కోసం ప్రయత్నించడం మంచిది. ఇదివరకే ఇల్లు కలిగి ఉన్నవారు మరో ఇంటిని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో సొంత ఇల్లు లభిస్తుంది.
  3. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు ఈ రాశివారికి గృహ యోగం కలిగించే అవ కాశం ఉంది. సాధారణంగా ఫ్లాట్ ను కొనుగోలు చేయడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో తప్ప కుండా రుణ సౌకర్యాలు అందుతాయి. సొంత ఇంటితో పాటు సొంతగా స్థలాలు అమర్చుకోవడానికి కూడా బాగా అవకాశం ఉంది. ఈ రాశివారికి గృహ యోగానికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో గృహ ప్రవేశం చేయడానికి అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గృహ కారకుడు గురువు సంచారం వల్ల గృహ, వాహన యోగాలతో పాటు స్థలాలు, స్థిరాస్తులు కొనడానికి కూడా బాగా అవకాశం ఉంది. ఇప్పటికే సొంత ఇల్లు కలిగి ఉన్నవారికి మరో ఇల్లు లభించే సూచనలున్నాయి. గురువు భాగ్య స్థాన సంచారం వల్ల ఈ రాశివారికి తేలికగా రుణ సహాయం లభించే అవకాశం ఉంది. సొంత ఇంటి మీద భారీగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు వీరికి తప్పకుండా సొంత ఇల్లు అమరుతుంది.
  5. ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో ప్రవేశించి ఈ రాశిని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి వచ్చే ఏడాది మే లోపు తప్పకుండా సొంత ఇల్లు అమరుతుంది. ఇండిపెండెంట్ హౌస్ కట్టించుకోవడం జరుగుతుంది. ఒక పాత ఇంటిని కొనుగోలు చేసి పునర్మించుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటికి కావలసిన రుణ సౌకర్యం కొద్ది ప్రయత్నంతో లభిస్తుంది. ప్రస్తుతం సొంత ఇంటి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. భారీ ఖర్చుతో సొంత ఇల్లు అమరుతుంది.
  6. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఈ రాశివారికి సొంత ఇంటి యోగం కలుగు తుంది. ఫ్లాట్ కొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత ఇంటి మీద భారీ ఖర్చు తప్పక పోవచ్చు. ఆశించిన రుణ సౌకర్యం లభిస్తుంది. ఇప్పటికే సొంత ఇల్లు కలిగి ఉన్నవారికి మరో ఇల్లు కొనే అవకాశం ఉంది. సొంత ఇంటి ప్రయత్నాలకు ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది. నవంబర్ నెలలో గురువు తాత్కాలికంగా ఉచ్ఛపడుతున్నందువల్ల గృహ ప్రవేశానికి అవకాశం ఉంది.

ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..