మీ జన్మ జాతకంలో చంద్ర దోషం ఉందా? పౌర్ణమి రోజు ఇలా చేస్తే చాలు

2026 జనవరిలో మొదటి పౌర్ణమి 3 తేదీన వస్తోంది. చంద్రదోషంతో బాధపడుతున్నవారు ఈ రోజున ప్రత్యేక పరిహారాలు చేసుకోవాలని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలు, మానసిక సమతుల్యతకు కారకుడిగా పరిగణిస్తారు. జాతకంలో చంద్రడు బలహీనంగా ఉంటే లేదా చంద్ర దోషం ఉన్నట్లయితే.. మానసిక అశాంతి, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. చంద్ర దోషాన్ని తొలగించుకునేందుకు సూచించిన పరిహారాలు చేస్తే సరిపోతుంది.

మీ జన్మ జాతకంలో చంద్ర దోషం ఉందా? పౌర్ణమి రోజు ఇలా చేస్తే చాలు
Chandra Dosh

Updated on: Jan 02, 2026 | 5:37 PM

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలు, మానసిక సమతుల్యతకు కారకుడిగా పరిగణిస్తారు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతిగా ఉంటాడు. జాతకంలో చంద్రడు బలహీనంగా ఉంటే లేదా చంద్ర దోషం ఉన్నట్లయితే.. మానసిక అశాంతి, నిర్ణయం తీసుకోవడంలో విశ్వాసం లేకపోవడం, ఆరోగ్యపరంగా సమస్యలు, అనవసర ఖర్చులకు దారితీస్తుంది. చంద్ర దోషాన్ని తొలగించుకునేందుకు పలు పరిహారాలను పండితులు సూచిస్తుంటారు.

మహా శివుడు తన తలపై చంద్రుడిని ధరిస్తాడు. అందుకే జాతకంలో చంద్ర దోషాన్ని తొలగించి చంద్రుడిని బలోపేతం చేయడానికి శివుడికి సంబంధించిన పరిహారాలు చేస్తారు. పౌష పౌర్ణమి రోజున చంద్ర దోషాన్ని తొలగించుకోవడానికి పరిహారాలు కూడా చేస్తారు. ఈ పరిహారాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

పౌర్ణమి ఎప్పుడంటే?

2026 జనవరి నెలలో మొదటి పౌర్ణమి జనవరి 3న వస్తుంది. ఈ రోజును పవిత్రంగా భావిస్తూ ప్రజలు నదులలో స్నానాలు చేస్తారు. పండితులు సూచించిన పరిహారాలు దానం చేస్తారు. సూర్యోదయం సమయంలో సూర్యుడికి నైవేద్యాలు సమర్పిస్తారు. జనవరి 3న వస్తున్న పౌష పౌర్ణమినాడు శివుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

చంద్ర దోషాన్ని నివారించే పరిహారాలు

మీ జాతకంలో చంద్ర దోషం తొలగిపోయి.. చంద్రుడిని బలోపేతం చేసేందుకు పౌర్ణమినాడు బియ్యం, పిండి, పాలు, పెరుగు మొదలైన తెల్లటి వస్తువులను దానం చేయాలి. తెల్లటి వస్తువులు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటాయి.

ఈ రోజున వెండి ఉంగరం, ఇతర ఆభరణాలు ధరించడం వల్ల చంద్రుడి దోషాలు తొలగిపోయి మీ జాతకంలో చంద్రుడు బలపడతాడు. చంద్రుడికి, వెండి కూడా సానుకూల సంబంధం ఉందని చెబుతారు.

పౌర్ణమి నుంచి క్రమం తప్పకుండా అమ్మవారిని సేవించాలి. అలా చేయడం వల్ల చంద్రుని ఆశీస్సులు లభిస్తాయి. మీ జాతకంలోని చంద్రదోషం త్వరగా తొలగిపోతుంది. మీ మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది.

పౌర్ణమినాడు శివుడి ఆలయాన్ని సందర్శించి పూజించాలి. బియ్యం, పిండి, ముఖ్యంగా చీపురును దానం చేయవచ్చు. ఇవి చంద్ర దోషాన్ని తగ్గించేందుకు సహాయ పడతాయి. దీంతో మీ జీవితంలో సానుకూల ఫలితాలు చోటు చేసుకుంటాయి.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.