Telugu News Astrology How the Strength of Your Ruling Planet Shapes Your Destiny: 6 Lucky Zodiac Signs
Astrology: రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
ప్రస్తుత గ్రహ సంచారంలో రాశ్యాధిపతి స్థితి ఆరు రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి బలం వ్యక్తి జీవితంలో విజయాలు, అదృష్టం, యోగాల ఫలితాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మేషం, వృషభం, మిథునం, కన్య, మకరం, మీన రాశుల వారికి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడన్న దాని మీదే వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి బలంగా, సరైన స్థానంలో ఉన్న పక్షంలో జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. చిన్న యోగమైనా అద్భుత ఫలితాలనిస్తుంది. లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి బలహీనంగా ఉన్న పక్షంలో జాతకంలో ఎన్ని యోగాలున్నప్పటికీ ఫలించే అవకాశం ఉండదు. ప్రస్తుత గ్రహ సంచారంలో రాశ్యధిపతి స్థితి మేషం, వృషభం, మిథునం, కన్య, మకరం, మీన రాశుల వారికి మాత్రమే అనుకూలంగా ఉంది.
మేషం: రాశ్యధిపతి కుజుడు ఆగస్టు 2 వరకు ధన స్థానంలోనూ, ఆ తర్వాత తృతీయ స్థానంలోనూ సంచా రం చేస్తున్నందువల్ల ఎక్కువగా శుభ యోగాలను కలిగించే అవకాశం ఉంది.ఈ రాశివారికి ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. రెండు నెలల పాటు ఆదాయం వృద్ధి చెందడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం, పదోన్నతి కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి.
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఆగస్టు 4 వరకు చతుర్థ స్థానమైన సింహ రాశిలో, ఆ తర్వాత కన్యారాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆగస్టు చివరి లోగా పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన సంబంధమైన కోరికలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగుతాయి.
మిథునం: రాశ్యధిపతి బుధుడు తన స్వక్షేత్రమైన మిథునంలోనూ, ఆగస్టు నుంచి ధన స్థానంలోనూ సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడడానికి, ధనం పెరగడానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి చోటు చేసుకుంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
కన్య: రాశ్యధిపతి బుధుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల మరో నెలన్నర పాటు ఈ రాశివారికి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. తప్పకుండా ఆదాయ వృద్ధి, వృత్తి, ఉద్యో గాల్లో పురోగతి లేదా ప్రమోషన్ వంటివి చోటు చేసుకోవడం జరుగుతుంది. అనారోగ్యం నుంచి ఉప శమనం లభిస్తుంది. ముఖ్య కార్యాలు చేపట్టడానికి ఇది బాగా అనుకూల సమయం. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి.
మకరం: రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మీనం: రాశినాథుడైన గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల, కుటుంబంలో అనుకోకుండా శుభకార్యాలు జరగడం, ఆదాయం వృద్ధి చెందడం, ఉద్యోగంలో స్థిరపడడం, పిల్లలు అభివృద్ధిలోకి రావడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా ఇతరులకు మేలు చేయగల స్థితికి చేరుకుంటారు. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా చెప్పబడినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)