Horoscope Today: రాశి ఫలాలను అనుసరించి కొత్త పనులను ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో గ్రహాలు అనుకూలించిన చేపట్టిన పనుల్లో ప్రతికూలత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. మరి నేటి మీ రాశి ఫలాలు ఎలాఉన్నాయో ఓసారి చూసుకొని దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి..
మేష రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రగతిని సాధించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని లక్ష్యాలను నిర్ధేశించుకోగలుగుతారు. పేదవారికి కాయగూరలు దానం చేసుకోవడం మంచిది.
ఈ రాశి వారికి ఈరోజు స్థిరాస్థులను వృద్ధి చేసుకోవడానికి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగాది విషయాల్లో అనుకూలత కనిపిస్తోంది. దైవ నామ స్మరణ చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. గో సేవ చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.
మిథున రాశి వారికి ఖర్చులు పెరుగుతుంటాయి. అలాగే శక్తికి మించిన పనులు చేపడుతుంటారు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం వీరికి శుభ ఫలితాలను చేకూరుస్తుంది.
ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడే అవకశాలు కనిపిస్తున్నాయి. ఆలోచనల విధానాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పేద వారికి ఆహార పదార్థాలు దానయం చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది.
సింహ రాశి వారు కుటుంబపరమైన కార్యక్రమాలు చేపడుతుంటారు. సంఘంలో గౌరవం పెంచుకునేందుకు కొంత ప్రాధాన్యత ఇస్తారు. పక్షులకు నీటిని అందజేయడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
ఈ రాశి వారు చేపట్టే పనులు మంచి సత్ఫలితాలను అందిచగలుగుతాయి. వ్యక్తిగత పనులన్నీ సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మహా ఖాళీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
తులా రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైన కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహా లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
ఈ రాశి వారి చేపట్టిన కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి గతులను మెరుపు పరుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. గౌరీ శంకరుల ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ధన్వంత్రి స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
ఈ రాశి వారు తాము చేపట్టిన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమ అధికంగా ఉంటుంది.. గౌరవ, మర్యాదలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తులసి దళంతో విష్ణు పూజ చేసుకోవడం ద్వారా వీరికి మేలు జరుగుతుంది.
కుంభ రాశి వారు ఈరోజు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వాహన యోగాలు కూడా వీరికి కలిసి వస్తాయి. కుటుంబపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నారాయణ నామ స్మరణ మేలు చేస్తుంది.
మీన రాశి వారికి ఆర్థిక స్థితి గతులు మెరుగుపడతాయి. నిరుత్సాహంతో కూడిన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవవాలి. గణపతి నామస్మరన స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
Also Read: Raghu Rama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణంరాజు.. నేడు వైద్య పరీక్షలు..
సింగపూర్‌లో కోవిడ్ బి.1.617 స్ట్రెయిన్ కలకలం.. పిల్లలపై అత్యధిక ప్రభావం.. స్కూళ్లు మూసివేత..