Horoscope Today: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పవు

|

Jun 02, 2021 | 8:33 AM

Horoscope Today: క్యాలెండ‌ర్‌లో మ‌రో కొత్త నెల ప్రారంభ‌మైంది. ఈ రోజు మీ రాశి ఫ‌లం ఎలా ఉందో తెలుసుకొని దానికి త‌గిన‌ట్లుగా ప్రణాళికలు చేసుకుంటే అంతా మేలు జ‌రుగుతుంది..

Horoscope Today: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పవు
Follow us on

Horoscope Today: క్యాలెండ‌ర్‌లో మ‌రో కొత్త నెల ప్రారంభ‌మైంది. ఈ రోజు మీ రాశి ఫ‌లం ఎలా ఉందో తెలుసుకొని దానికి త‌గిన‌ట్లుగా ప్రణాళికలు చేసుకుంటే అంతా మేలు జ‌రుగుతుంది. మ‌రి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేష రాశి

ఈ రాశి వారు ఈ రోజు స్నేహితుల సహాయంతో ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి.

వృషభ రాశి

ఈ రాశివారికి ఇరుగు పొరుగు వారితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు.

మిథున రాశి

ఉద్యోగంలో ఈ రాశివారు ప్రశంసలు అందుకుంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి

ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చుకునే కార్యక్రమం చేపడతారు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మీరు విజయం సాధిస్తారు.

సింహ రాశి

ఈ రాశిగలవారు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కోర్టు విషయాలలో విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

కన్య రాశి

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సత్ఫలితాన్నిస్తుంది. కొందరు స్నేహితులతో చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుంటారు. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు.

తుల రాశి

వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారులు ఎంతగానో ప్రోత్సహిస్తారు. అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుక్కోవాలని గట్టి నిర్ణయానికి వస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి

ఈ రాశివారికి ఈ రోజు డబ్బు కలిసి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వీసా మంజూరు అవుతుంది.

ధనస్సు రాశి

ఈ రాశివారికి కొంత అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు.

మకర రాశి

వ్యాపారులకు ఈ రోజు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఏ పని చేసిన కొంత శ్రమించాల్సి ఉంటుంది.

కుంభ రాశి

వ్యాపార విషయంలో సానుకూలత ఉంటుంది.వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి

ఈ రాశివారికి ఈ రోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. దేవుడి మీద భక్తి బాగా పెరుగుతుంది. వ్యాపారులు మంచి పురోగతి సాధిస్తారు. హామీలు ఉండవద్దు.

ఇవీ కూడా చదవండి:

Chitragupta Swamy Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? ప్రత్యేకత ఏమిటి..?

రాజకీయ సంక్షోభం నడుమ….రామాలయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించిన నేపాల్ ప్రభుత్వం…