
వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో తొంద రపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబ జీవి తం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా పురోగతి ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగు తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. కెరీర్ పరంగా జీవిత భాగస్వామి కూడా పురోగతి చెందుతారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగు తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన ప్రయ త్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా, సాఫీగా సాగిపోతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఆదాయ ప్రయ త్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. కొందరు బంధు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. చదువుల్లో పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. కుటుంబపరంగా చిన్నా చితకా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థికంగా రోజంతా బాగానే గడిచిపోతుంది. వ్యక్తిగతంగా తప్ప కుండా పురోగతి ఉంటుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూలతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యక్తిగత జీవితంలో అనుకోకుండా కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఆదాయా నికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
ఈ రాశివారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం అయినా సానుకూల ఫలితా లనిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యో గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కూడా మీ వ్యూహాలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తి గత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఆదాయం అనుకూలంగా ఉన్న ప్పటికీ ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. బంధువులతో అపార్థాలు, సమస్యలు తలెత్తవచ్చు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులను చేపట్టి ప్రయోజనం పొందుతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు మెరుగుపడడంతో పాటు, ఉద్యోగం మారే అవకాశాలు కూడా అనుకూలంగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుం టారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ప్రతి పనిలోనూ కొద్దిగా శ్రమ, తిప్పట ఉండవచ్చు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం సంతోషంగా, సామరస్యంగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సమా జంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త అందు తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లోనూ, సామాజిక సేవల్లోనూ పాల్గొంటారు.