
దిన ఫలాలు (జనవరి 31, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టే సూచనలున్నాయి. మిథున రాశి వారికి తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగి పోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొందరు బంధువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధు మిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి.
ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత ఉన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో అత్యధిక ప్రయోజనం పొందుతారు.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అధికారులు ఎక్కువగా మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో కూడా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధువర్గంలో కోరుకున్న పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
ఉద్యోగంలో అధికారం చేపడతారు. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ విషయమైనా ఆశించిన అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాల్లో అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఉద్యోగ జీవితంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. సమాజంలో గౌరవమర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు పదోన్నతులు కూడా లభిస్తాయి. జీతభత్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరి స్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మిత్రులకు సాయం చేస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. అయితే, ఆశించిన స్థాయిలో జీతభత్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ధనపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆదాయానికి లోటుండదు.
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.