Horoscope Today: వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యయ ప్రయాసలున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Horoscope Today: వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today

Edited By:

Updated on: Jan 24, 2026 | 6:33 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికా రులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆక స్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య అవకాశాలున్నాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఒకరిద్దరు బంధువులకు సాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారంలో కొద్ది శ్రమతో అత్యధిక లాభాలు గడిస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలావరకు సానుకూలంగా, సంతోషంగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని కొద్ది ప్రయత్నంతో చక్కబెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పురోగతి చెందుతారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ఆర్థికంగా అనుకూలతలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కొత్త ఉద్యోగాలు, కొత్త ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా బిజీ అయిపో తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సమే తంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కాస్తంత ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. ఏ పని తలపెట్టినా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదు కుంటారు. ఆదాయానికి లోటుండదు కానీ, కొన్ని అనవసర ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించు కోవడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, దైవ కార్యాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు బాగా ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇత రులకు ఆర్థికంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తుకోవడం జరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదా యానికి సంబంధించి సరికొత్త మార్గాలు లభిస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం  అను కూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. స్వల్పంగా అనారోగ్య సమస్యలుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉండ వచ్చు. వ్యయ ప్రయాసలున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇరుగు పొరుగు నుంచి కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగు తాయి. ఏ పని తలపెట్టినా కొద్ది శ్రమతో పూర్తవుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.