చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం తప్పదు. అందరినీ కలుపుకుపోవాలి. ఆగ్రహావేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠిస్తే శుభం కలుగుతుంది.
కీలక పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. డబ్బు విషయంలో పొదుపు పాటించాలి. ఓర్పుగా వ్యవహరించండి. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. శివనామాన్ని జపిస్తే మంచిది.
కీలక విషయాలు, వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులను అదుపు చేసుకోవాలి. శనిధ్యానంతో మేలు చేకూరుతుంది.
ఈ రాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదైవ నామస్మరణతో మరిన్ని సానుకూల ఫలితాలు అందుకుంటారు.
ఎన్నో ఏళ్లుగా వేధిస్తోన్న ఒక సమస్య పరిష్కారమవుతుంది. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞులు, ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది. విష్ణుసహస్రనామం చదవితే మేలు జరుగుతుంది.
చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరించగలుగుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధనతో శుభం కలుగుతుంది.
చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు రావడానికి బాగా శ్రమపడాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోనేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శని శ్లోకాన్ని జపిస్తే మంచిది.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన మనసుకు బాధ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో కాస్త నిరుత్సాహం కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవతో మంచి ఫలితాలు పొందుతారు.
ఈ రాశివారికి సానుకూల ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో పైచేయి సాధిస్తారు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. హనుమంతుడిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.
కీలక పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. మొహమాటం, దాపరికం దూరం చేసుకోవాలి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.
ఈరాశి వారికి శుభకాలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతోఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు వస్తాయి.
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మొహమాటాన్ని దూరం పెట్టండి. బంధువులతో కలహలు వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి