ఈ రాశుల వారికి మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అస్థిర ఆలోచనలు, నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
పనితీరుకు పై అధికారుల నుంచిప్రశంసలు లభిస్తాయి. కీలక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనంతో మంచి ఫలితాలు పొందుతారు.
ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురువతాయి. సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.
ఈ రాశుల వారికి శుభ ఘఢియలు నడుస్తున్నాయి. చేపట్టిన పనులు, రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. విందులు, వినోద కార్యక్రమాలు, శుభాకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో సంతోషకర క్షణాలు గడుపుతారు.
కీలక విషయాలు, పనుల్లో జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరమైతే ధైర్యంగా వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. శివారాధనతో శుభం కలుగుతుంది.
వీరికి శుభకాలం. సమయస్ఫూర్తి, చిత్తశుద్ధితో సానుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, కలహాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా, ఓర్పుగా వ్యవహరించడం మంచిది. శివారాధన వల్ల మేలు చేకూరుతుంది.
ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబీకులు, బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవిని దర్శించుకుంటే మంచిది.
పట్టుదలతో ముందుకు సాగాలి. ఒత్తిడిని అధిగమిస్తేనే పనులు నెరవేరుతాయి. బంధు, మిత్రులను కలుపుకొనిపోవాలి. కీలక వ్యవహారాలు, పనుల్లో పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పరమేశ్వరుడిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.
చేపట్టిన రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మితంగా మాట్లాడాలి. అప్పుల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దుర్గారాధనతో మంచి ఫలితాలు పొందుకుంటారు.
వీరు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన మనసుకు బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇష్టదైవ సందర్శనంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు.
స్థిరమైన ఆలోచనలు, నిర్ణయాలతో అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన రంగాల్లో ఊహించిన ఫలితాలు అందుకుంటారు. గొడవలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.
చేపట్టిన రంగాల్లో విజయాలు సాధించాలంటే శ్రమ తప్పదు. సమయస్ఫూర్తితో ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి . ఇష్టదైవారాధనతో సానుకూల ఫలితాలు పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..