Horoscope Today(07-05-2022): రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 7వ తేదీ )శనివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు అనుకోని విధంగా లాభాలను పొందుతారు. అనారోగ్య బాధలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. ప్రయాణం వలన లాభిస్తుంది. ఆవేశం, తొందర పాటు వలన కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడతాయి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు స్థిరాస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా ఆందోళన కలుగుతుంది. చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగస్తులకు వృద్ధి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు వృధా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు వహించాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి గ్రహ బలం విశేషంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్తపనులను మొదలు పెడతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఫలితాలను అందుకోవడానికి ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. నూతన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ప్రయాణాలు అధికంగా చేయాల్సి ఉంటుంది. అనారోగ్య బాధలు కలుగుతాయి. స్త్రీలు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. దైవ దర్శనం చేసుకుంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభఫలితాలను అందుకుంటారు. శుభ వార్తలు వింటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. అనారోగ్యనికి గురయ్యే అవకాశము ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. రుణప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలను ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Srilanka Emergency: మళ్లీ లంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు రాజపక్స.. కారణం అదే..
Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు