Horoscope Today (13-08-2022): నేటికీ రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగస్టు 13వ తేదీ ) శనివారం రాశి ఫలాలను (Rashi Phalalu) తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు భవిష్యత్ కోసం తగిన ప్రణాళికలు వేస్తారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రుల సహకారంతో తగిన నిర్ణయాలను తీసుకుంటారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శారీరకంగా అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లోని వారు కాలాన్ని వృధా చేయకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. బంధువుల వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికంగా డబ్బులను ఖర్చు చేస్తారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శత్రువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ కాలం. ఇతరులతో కలిసి తీసుకునే నిర్ణయాల వలన మేలు కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. మానసిక బలంగా ఉండాల్సిన సమయం.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే విధంగా పనులను ప్రారంభిస్తారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు బంధు, మిత్రులతో సుఖ సంతోషాలతో గడుపుతారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు తగిన ఫలితాలను ఇస్తాయి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు పట్టుదలతో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కీలక విషయాల్లో ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. ఆదాయానికి మించిన ఖర్చు చేస్తారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం ఉత్తమం. వృత్తి, విద్య, వ్యాపార రంగంలోని వారు ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా దైర్యం కలిగించే వార్తను వింటారు. సంతోషముగా కాలం గడుపుతారు. సమయానుకూలంగా వృత్తి, వ్యాపార రంగాల్లోని వారు ముందుకు సాగాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు సమస్యలనుంచి బయటపడి.. సంతోషముగా గడుపుతారు. ప్రతిభకు తగిన ప్రశంసను అందుకుంటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభవార్త వింటారు. కీలక విషయాల్లో సక్సెస్ అందుకుంటాగ్రహబలం బాగుంది. ఆయా రంగాల్లోని వారు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిశ్రమ కాలం. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)