Horoscope Today: వీరికి దైవబలం మెండుగా ఉంది.. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

|

Aug 02, 2022 | 6:40 AM

Horoscope Today (02-08-2022): పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే రోజులో

Horoscope Today: వీరికి దైవబలం మెండుగా ఉంది.. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
Follow us on

Horoscope Today (02-08-2022): పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం చూసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే రోజులో మంచి సమయం చూసుకుంటాం? ఆరోజు అశుభ సంకేతాలేమైనా ఉన్నాయేమోనని ఆరా తీస్తాం. అందుకోసం ఆరోజు రాశిఫలాలు (Rasi Phalalu)ను చూస్తాం. మరి ఆగస్టు 2న (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి.

మేషం

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధించారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విష్ణువును ఆరాధిస్తే మేలు కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

వృషభం

శ్రమాధిక్యం తప్పవు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి. కీలక పనుల్లో మందగమనం ఏర్పడుతుంది. ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఈశ్వరుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

మిథునం

ప్రారంభించిన పనులు ఆలస్యమవుతాయి. అనవసర వివాదాల్లోకి తలదూర్చకపోవడం ఉత్తమం. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. శివుడిని ఆరాధిస్తే మేలు.

కర్కాటకం

ఈరాశివారికి దైవానుగ్రహం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే సానుకూల ఫలితాలు పొందుతారు.

సింహం

భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తారు. మనసు కలుషితం కాకుండా చూసుకోవాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య దేవుడిని పూజిస్తే మంచిది.

కన్య

వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పొందుతారు. విందులు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన మరవద్దు.

తుల

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆయా రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చిస్తారు. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

వృశ్చికం

ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శ్రీనివాసుడిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.

ధనస్సు

ఆర్థికాంశాల్లో పురోగతి సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం. సమయస్ఫూర్తితో ముందుకు సాగుతారు. శివ నామస్మరణతో ఉత్తమ ఫలితాలు పొందుతారు

మకరం

ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. స్థిరమైన ఆలోచనలు అలవర్చుకోవాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. ఇష్టదేవతలను ఆరాధిస్తే మంచిది.

కుంభం

ఈరాశివారికి మిశ్రమకాలం. శ్రమాధిక్యం తప్పదు. పనులు ఆలస్యమవుతాయి. సమస్యలు పరిష్కారం కావు. మానసిక అశాంతి కలుగుతుంది. నవగ్రహధ్యానం శుభప్రదం.

మీనం

ఈరాశివారికి దైవబలం మెండుగా ఉంది. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో సానుకూల ఫలితాలు పొందుతారు. ఇష్టదేవతలను దర్శించుకుంటే మరీ మంచిది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..