Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి శ్రమకి తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

|

Dec 02, 2021 | 6:36 AM

Horoscope Today (November 20-11-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా రోజులో కొత్తపనులు ప్రారంభించేముందు తమకు ఈరోజు ఎలాంటి ఫలితం వస్తుంది.. మంచి చెడుల..

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి శ్రమకి తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

Horoscope Today (November 20-11-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా రోజులో కొత్తపనులు ప్రారంభించేముందు తమకు ఈరోజు ఎలాంటి ఫలితం వస్తుంది.. మంచి చెడుల గురించి .. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 2వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరాశివారు ఈరోజు కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్ధిక భారం పెరగకుండా చూసుకోవాలి. మంచి పనులు చేపడతారు. మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి  ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. అవసరానికి డబ్బులు అందుతాయి. శ్రమతగిన ఫలితం అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  శుభవార్త వింటారు. నూతన వస్తువులను, నగలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ఎన్ని ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి బద్ధకం వీడాల్సి ఉంటుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. వృత్తి, విద్య, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యలతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులను శ్రద్దగా పనిచేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి అవసరానికి ఆర్ధిక సహకారం లభిస్తుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. సమయపాలనలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. శుభవార్త వింటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి చేపట్టిన పనులను శ్రద్దగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో ముందుకు అడుగువేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ఆశయాల పట్ల కాలాన్ని వృధా చేయకూడదు.  ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలను అందిస్తాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేయనీయకుండా చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేసుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించడం వలన శుభఫలితం ఉంటుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశి భవిష్యత్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో శుభఫలితం అందుకుంటారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి

Also Read:

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ వివరాలివే..

దగ్గరపడుతున్న మేడారం సమ్మక్క–సారక్క జాతర.. వసతుల ఏర్పాట్లలో వేగం పెంచిన ప్రభుత్వం..