Horoscope Today (December 26th 2021): శుభకార్యాలు, పనులు, ప్రయాణం ఇలా ఏవి ప్రారంభించాలన్నా ఇప్పటికీ ఈరోజు మన జాతకం ఎలా ఉంది. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 26వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. బంధువులు, స్నేహితులను కలుస్తారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. స్థిరాస్తి సంబంధ విషయాల్లో సమస్యలు పరిష్కారమవుతుంది. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబంలో అనారోగ్య బాధలు కలుగుతాయి. మిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మేలు జరుగుతుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. స్త్రీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల పట్ల అనాసక్తితో ఉంటారు. కొన్ని పనులు రేపటికి వాయిదా వేసుకోవోడం మంచింది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. విద్యార్థులు విజయాన్ని సొంతం చేసుకుంటారు. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక భయం కల్గుతుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళనకు గురవుతారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి క్షణికావేశానికి గురవుతారు. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు అధికమవుతుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్ధిక ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తాయి. మిత్రుల, ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. స్త్రీల వలన లాభం ఉంది. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రణాళికా బద్దంగా పనిచేస్తూ లక్ష్యానికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్త్రీల వలన ధనలాభం ఉంటుంది.
మీన రాశి: ఈరోజు ఈరాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రాజకీయ, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.
Also Read: