Horoscope Today: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి..12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (December 21, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి..12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 21 December 2025

Edited By:

Updated on: Dec 21, 2025 | 5:31 AM

దిన ఫలాలు (డిసెంబర్ 21, 2025): మేష రాశి వారు ఈ రోజు ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆదాయానికి లోటుండదు. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సాయం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయానికి సమయం అనుకూలంగా ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. ఆస్తి, ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి జీవితంలో మార్పులు చేపడ తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులు చేదోడువాదోడుగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కొద్దిగా తగ్గే అవకాశముంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యాలకు, అనవసర సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాన్ని సందర్శించుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాల అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. జీవిత భాగ స్వామి కూడా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని భారం వల్ల కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆశించిన దానికి మించి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆస్తి వ్యవహారానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబ బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు, పని ఒత్తిడి పెరిగినప్పటికీ, మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ సజావుగా సాగిపోతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు ఆశించిన సమాధానం లభిస్తుంది. చాలా కాలంగా ఒత్తిడికి గురి చేస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనుల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మిత్రుల మీదా, విలాసాల మీదా బాగా ఖర్చు పెడతారు. ప్రముఖులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.