Horoscope Today (04-07-2022): ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏరంగంలోని వారైనా రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జులై 4 (సోమవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
మేషం
శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఓర్పు, సహనం పాటించాలి. అధికారుల వైఖరి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో ఆచి తూచి మాట్లాడాలి. శని ధ్యానంతో సానుకూల ఫలితాలు పొందుతారు.
వృషభం
పనుల్లో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహరాల్లో ముందడుగు వేస్తారు. సర్దుకుపోయే మనస్తత్వం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు లాభిస్తాయి. దుర్గా దేవిని పూజిస్తే మేలు కలుగుతుంది.
మిథునం
ఈ రాశివారికి గ్రహబలం తక్కువగా ఉంది. సమయస్ఫూర్తితో ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆహార నియమాలపట్ల శ్రద్ద వహించాలి. బంధువులతో వాదోపవాదాలు వద్దు. ప్రశాంతంగా వ్యవహరించాలి. శివ అష్టోత్తరం పఠిస్తే బాగుంటుంది.
కర్కాటకం
ఇబ్బందులు ఎదురైనా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. కీలక వ్యవహారాల్లో పట్టు సాధిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీనారాయణ సందర్శనం శుభప్రదం.
సింహం
ఈరాశివారికి అనుకూలమైన సమయం నడుస్తోంది. బంధుమిత్రులతో కలిసి కీలక వ్యవహరాలు చర్చకు వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికబద్దంగా పూర్తిచేస్తారు. ఉన్నతోద్యోగుల ప్రశంసలు అందుకంఉటారు. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణం మేలు కలుగుతుంది.
కన్య
మంచి మనసుతో ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణుడిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.
తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలవారికి శ్రమపెరుగుతుంది. ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలి. లేకపోతే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. అస్థిర ఆలోచనలతో ప్రమాదం. నవగ్రహ ధ్యానంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయాలంటే బాగా శ్రమించక తప్పదు. స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించి జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. హనుమంతుడిని పూజిస్తే మేలు కలుగుతుంది.
ధనస్సు
మీమీ రంగాల్లో ఒత్తిడి, ఆందోళన పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన లాంటివి అవసరమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయస్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
మకరం
ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహకారం పనికొస్త్ఉంది. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఇష్ట దైవాన్ని స్మరించుకుంటే శుభం కలుగుతుంది.
కుంభం
బుద్ధిబలం బాగుంటుంది. సమయస్ఫూర్తితో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల చెప్పుడు మాటలను వినకపోవడం మంచిది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే సానుకూలంగా ఉంటుంది.
మీనం
వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. కీలక వ్యవహారాలు, పనుల్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు సంతోషాన్ని అందిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలంగా వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు కలుగుతుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..