ఈరోజు (ఫిబ్రవరి 22వ తేదీ ) రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేషం..
అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్నివృథా చేయకండి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో (ప్రోత్సాహం లభిస్తుంది.
వృషభం..
చిత్తశుద్ధితో చేసే పనులు తృప్తినిస్తాయి.ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఆర్థికంగా లాభం పొందుతారు. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేయెద్దు.
మిథునం..
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మిత్రులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.
కర్కాటకం..
అదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
సింహం..
ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. స్నేహితులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.
కన్య…
స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభం చేకూరుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం, అరోగ్యం నిలకడగా ఉంటాయి. రావాల్సిన డబ్బు అనుకోకు౦డా చేతికి అంది అవసరాలు తీరతాయి. పలుకుబడిగలవారి తో మంచి పరిచయాలు ఏర్పడతాయి.
తుల..
అదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది.
వృశ్చికం..
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శనిశ్లోకం చదవాలి.
ధనస్సు..
అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
మకరం..
ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. స్నేహితుల నుంచి ఆశించినంత సహాయ సహకారాలు లభించకపోవచ్చు. కష్టంలో ఉన్నా ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి.
కుంభం..
చెడు స్నేహాలకు బాగా దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అరోగ్యం బాగానే ఉంటుంది. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
మీనం..
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయే అవకాశం ఉంది. సంతోషకరమైన వార్తలు వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి.
Also Read
Gold Silver Price Today: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?