Horoscope Today: ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి.. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం.. ఈరోజు రాశిఫలాలు..

|

Apr 23, 2021 | 8:03 AM

Horoscope Today April 23rd 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే

Horoscope Today: ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి.. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today
Follow us on

Horoscope Today April 23rd 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ గురువారం (ఏప్రిల్ 23న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి..

ఈరోజు వీరు చేపట్టినటువంటి పనులలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైన విషయాల్లో కొంత సంతోషాలు ఏర్పడుతాయి. మహా గణపతి అర్చన మేలు చేస్తోంది.

వృషభ రాశి..

ఈరోజు వీరికి సౌకర్యాలు ఇబ్బందులు కలిగిస్తుంటాయి. మాంత్ర సౌకర్యం విషయంలో కొంత ఆనందంగా ఉంటారు. లలితా అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

మిథున రాశి..

ఈరోజు వీరు దగ్గరి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. అలాగే తీర్థ క్షేత్రాలను సందర్శించాలనే కోరికలు కలుగుతాయి. శివార్చన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరు ఆర్థిక ప్రయోజనాల విషయంలో మిశ్రమమైన ఫలితాలను పొందుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మహలక్ష్మీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు వీరికి ఖర్చులు పెరుగుతాయి. అయినకూడా వాటిని అధిగమిస్తుంటారు. గౌరవ మర్యాదాల విషయంలో సంతోషంగా ఉంటారు. ఆంజనేయ స్వామి అర్చన మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈరోజు వీరు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటుంటారు. అలాగే కొన్ని ఖర్చులు పెరుగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విష్ణు పూజ మేలు చేస్తోంది.

తులారాశి..

ఈరోజు వీరు ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. ఉద్యోగ, వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీ రాజమాతాంగై నమః అనే నామ స్మరణ మరింత మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి. ధన్వంతరీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి వేరు వేరు రుపాల్లో ప్రయత్న లోపం లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతుంటాయి. అష్ట లక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు వీరికి పనులలో ఆటంకాలు కలుగుతుంటాయి. శ్రమాధిక్యత ఇబ్బందులను కలుగచేస్తుంది. నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆకస్మిక ప్రయణాలు చేయాల్సిన అవసరాలు కలుగుతుంటాయి. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం మేలు చేస్తోంది.

మీన రాశి..

ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. గణపతి సంకటన స్త్రోత్ర పారాయణం మేలు చేస్తోంది.

Also Read: Gas Cylinder: గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారి కోసం కొత్త సిలిండర్లు..

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక..